viral video: pakistan cleanliness tip for swachh bharat ఎంత పెద్ద వాకిలినైనా ఇట్టే ఊడ్చేయవచ్చు..

Pakistani aunty sweeping the floor riding a hoverboard

Funny Pakistani Video, pakistan woman cleanliness tip for swachh bharat, Hoverboard,Narendra Modi,Narendra Modi Swachh Bharat Abhiyan,Swachh Bharat Abhiyan,Swachhta Diwas,viral videos

The footage of a pakistani woman sweeping the floor gives a cleanliness tip for swachh bharat abhiyan, the video is going crazy viral on the social media with netizens dubbing it as ‘Perfect use of hoverboard’.

ITEMVIDEOS: వైరల్ వీడియో: ఎంత పెద్ద వాకిలినైనా ఇట్టే ఊడ్చేయవచ్చు..

Posted: 10/04/2017 01:05 PM IST
Pakistani aunty sweeping the floor riding a hoverboard

స్వచ్ఛాభారత్ అభియాన్ అనే మిషెన్ ను జాతిపిత మహాత్మగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ ప్రభు్త్వం అధికారంలోకి వచ్చిన 2014 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకంతో దేశ పరిశుభ్రంగా వుంచాలని పిలుపును కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఇటీవల ముగిసిన గాంధీజయంతికి మూడేళ్లు పూర్తి చేసుకున్న స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రముఖులందరికీ ప్రధాని ధన్యవాదలు కూడా తెలిపారు. ఏ ఏడాదికాయేడాది వివిధ రంగాలలో సెలబ్రిటీలైన పలువురు ప్రముఖులకు కూడా లేఖలు రాస్తూ అందరినీ స్వచ్చతాహీ సేవలో పాలుపంచుకోవాలని కోరుతూ లేఖలు కూడా రాశారు.

అయితే పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముంగిట వున్న పెద్ద వాకిలిని ఊడ్చటానికి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతూ యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. అయితే స్వచ్ఛా భారత్ అభియాన్ అనే మిషన్ కు ఈ చిట్నాకు కూడా వినియోగించుకోవచ్చునన్న సందేశాన్ని కూడా ఇస్తున్నట్లు వుందామె. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు అన్ లైన్ లో విపరీతంగా చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను పోస్టు చేసిన 20 గంటల వ్యవధిలోనే సుమారు 9 వేల మంది వీక్షించగా, అరు వేల మంది కామెంట్లు చేశారు. కాగా ఐదున్నర వేల మంది దీనిని షేర్ కూడా చేసుకున్నారు.

ఇంతకీ అమె చేసిందేమిటీ..? అమె వినియోగించిన సాంకేతికత పరిజ్ఞానం ఏమిటీ..? అన్న సందేహం కలగుతుందా..? తమ ఇంటిముందున్న పెద్ద వాకిలిని ఊడ్చిడం కోసం నడుం వాల్చి వాల్చి నెమ్మిపుట్టిందో ఏమో.. ఈమెకు ఉపకరించేందుకు తమ బిడ్డలు ఓ కొత్త సాంకేతికతను జోడించారు. అదే హోవర్ బోర్డు. హోవర్ బోర్డుపై కూర్చోని అమె ఎంచక్కా వాకిలిని ఊడ్చేస్తుంది. చీటికీ మాటికీ వంగుతూ లేస్తూ నడుంపై తీవ్ర భారం పడుతుండటంతో దానిని నుంచి అమె హోవర్ బోర్డు ఉపశమనాన్ని కల్పించింది. అదెలాగో మీరే చూడండీ..

ఇక దీనిపై కూడా నెట్ జనులు అనేక కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మనం అంతా 2017లో వుంటే ఈమె మాత్రం ఏకంగా 3017లోకి వెళ్లిందని, ఏకంగా ఓ సహస్రాబ్ది ముందుకు ప్రపంచాన్ని తీసుకెళ్లిన మహిళను అభినందించాలని కూడా కామెంట్లు వెల్లివిరుస్తున్నాయి. ఇక మరికోందరు మాత్రం హోవర్ బోర్డు సరికొత్త నిర్వచనం చెప్పిందని, ఇంకోందరు హోవర్ బోర్డు ను నూటికి నూరు శాతం సరైన విధంగా వాడుతుందని రకరకాల కామెంట్లు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Funny Pakistani Video  Hoverboard  Narendra Modi  Swachh Bharat Abhiyan  viral videos  

Other Articles