ప్రధాని నరేంద్రమోదీ మానియా, నమో మంత్రం గత ఎన్నికలలో తమ పార్టీకి తిరుగులేని విజయాలను అందించాయని చెప్పుకోచ్చిన పార్టీ నేతలు ప్రశంసలు ఇన్నాళ్లు ఓ వైపు కొనసాగుతున్న క్రమంలోనే మరోమారు మోదీ ప్రభుత్వం ఎన్నికలకు సన్నధం అవుతున్న నేపథ్యంలో.. సొంతపార్టీకి చెందిన సీనియర్ నేతల నుంచి విమర్శల జడివాన కురుస్తుంది. ఇప్పటికే సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శత్రఘ్న సిన్హా మోదీని విమర్శించగా ఆ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ఆయన మరెవరో కాదు మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరి.
ప్రత్యర్థి పార్టీల నేతలు నరేంద్రమోడీ విధానాలను విమర్శించడం సాధారణమే అయినా.. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే ప్రధానిని ఆయన విధానాలను, వాటిని ప్రచారం చేస్తున్న తీరు.. అవి సాధిస్తున్న ఫలితాలను బేరిజు వేసి మరీ మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా మోదీపై ఎందుకు దండెత్తుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే తాజాగా అరుణ్ శౌరీ కూడా మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆత్మహత్య సదృశ్యంగా పరిగణించారు.
నోట్ల రద్దు నిర్ణయం చేపట్టే ముందు ప్రభుత్వం చెప్పిన మాటలు, లక్ష్యాలేమీ నేరవేరలేదని, నల్లధనం అలాగే వుందని, ఉగ్రవాదులు దేశంలోకి వస్తున్నారని, ఈ తరుణంలో వారికి చెప్పడానికి ఏమి మిగల్లేదని చెప్పారు. ఇక అటు అమిత్ షాపై కూడా నిప్పులు చెరిగిన ఆయన సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుత అర్ధిక ప్రగతి నెమ్మదించిందని చెప్పడాన్ని కూడా తప్పుబట్టారు. వాస్తవిక గణాంకాలను ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా అది సాధ్యం కాదని అన్నారు.
ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణముందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాదనను సమర్ధించేలా.. అదొక పెద్ద మనీలాండరింగ్ స్కీమ్ అంటూ ఆరోపించారు. అది ఒక పిచ్చి చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో నల్లకుబేరులందరూ తమ డబ్బును తెల్లగా మార్చుకున్నారని పేర్కోన్నారు. మోగీ ప్రభుత్వం రెండున్నర వ్యక్తలకు చెందినదిగా చెప్పుకోచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా, పార్టీలో వున్న ఓ న్యాయవాదికి సగభాగం మేర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. వారంతా ఇప్పుడు సీల్డు ఎకో చాంబర్ లో వున్నారని, ఎవరేం చెప్పినా వారు వినిపించుకోరని దుయ్యబట్టారు.
నోట్ల రద్దు నేపథ్యంలో చిన్న, మధ్యామిక పరిశ్రమలు వేదనను కూడా అర్బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, అయితే వాటిని ఎవరూ వినిపించుకోలేదని. ఇక యశ్వంత్ సిన్హా, చిదంబరం లాంటి అర్థిక రంగ నిపుణులు వాస్తవాలను చెప్పినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అన్నారు. ఆ వాస్తవాలు అర్బీఐ సర్వే, ఎస్బీఐ నివేదికలు, ఎకానమిక్ సర్వేలు కూడా నిజమని అంగీకరిచాయని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే.. 2015-16లో 9శాతంగా నమోదైన పారిశ్రామిక ప్రగతి సూచి.. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు త్రైమాసికానికి 1.7శాతానికి ఎందుకు పడిపోయిందని ఆయన ప్రశ్రించారు. దీనిపై పాలకుకు శ్రద్ద అవసరం లేదా..? అని ప్రశ్నించారు.
జీఎస్టీ పూర్తిగా తప్పుదోవపడుతుందని, అమలు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా సామాన్యుల డబ్బు కొల్లగొట్టినట్లవుతుందని, వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్రం చేసిన తప్పుల్లో జీఎస్‌ఎటీ కూడా ఒకటని అని, దానిని తిరిగి సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్‌టీ అమలు ప్రారంభించి మూడు నెలలు కూడా పూర్తికాకమునుపే ఏడుసార్లు సవరించారని దుయ్యబట్టారు. 'జీఎస్‌టీ ప్రారంభం సందర్భంలో వారంతా అతిగా ఊహించుకొని భారత స్వాతంత్ర్యం తోటి పోల్చారని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్ మెంట్ తరహాలో పాలన సాగిస్తుందని, దేశంలో పలు అంశాలు అత్యంత ప్రధాన్యతను సంతరించుకుని.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అశగా ఎదురుచూస్తుండగా, ఆ అంశాలపై అసలు స్పందించకుండా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం.. 300 ఫీట్ల ఎత్తులో నిర్మించే విగ్రహం గురించి మాత్రం ఉపన్యాసాలు ఇస్తారని, బుల్లెట్ రైళ్ల గురించి గంటల కొద్ది ప్రసంగాలను ఇస్తారని, ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో అత్మసంతృప్తిని కూడా చెందుతుందని శౌరీ దుయ్యబట్టారు.
మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ అర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాపై బీజేపి నేతలతో తీవ్ర విమర్శలు చేయించి వారిపై కొండచరియలు విరిగిపడినట్లు వారిని సమాధి చేసేస్తారని కూడా ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల్లో ముందస్తు అంచనా, స్థిరత్వంతో పాటు విశ్వసనీయత కూడా వుండాలని అయితే అవి మోదీ ప్రభుత్వంలో అదృశ్యమయ్యాయని మండిపడ్డారు. ప్రసత్తుం మోడీ ప్రభుత్వం విధాన అమలులో బ్లూ ప్రింట్ ప్రకటనలు చేసిన అనంతరం కూడా అవకతవకలు వున్నాయని వాటికి ఉదాహరణే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు అని అరుణ్ శౌరీ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more