KCR Thanks to Singareni Elections Victory | సింగరేణి కార్మికులకు కృతజ్నతలు.. కోదండరాంపై కేసీఆర్ ఫైర్

Kcr press meet on singareni victory

Singareni Elections 2017, TGBKS, Chief Minister KCR, KCR Press Meet, KCR Singareni Elections, KCR Thanks to Singareni Employees

Singareni Elections 2017 Telangana CM KCR thanks to Employees. Fire on Prof Kodandaram Comments on TGBKS..

ITEMVIDEOS:సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు : సీఎం కేసీఆర్

Posted: 10/06/2017 04:10 PM IST
Kcr press meet on singareni victory

సింగరేణి ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేశాయని.. అయినా కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను గెలిపించిన కార్మికులందరికి ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీలు ఏకమైనప్పటికీ టీబీజీకేఎస్ కు భారీ మెజార్టీ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తామని, ప్రతి ఎన్నికల్లో తమను గెలిపిస్తున్న కార్మికులకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. విపక్షాలు ప్రతీ అంశాన్ని రచ్చ కెక్కించి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, అయితే తమ పనితనం మూలంగానే కార్మికులు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిసారి, ‘కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది’ అని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయని ఆయన విమర్శించారు.

వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది వాళ్లయితే, ఆ ఉద్యోగాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించింది తమ పార్టీ అని అన్నారు. కారుణ్య నియామకాలతో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఆ బాధ్యత తనదేనని ఆయన అన్నారు. ఇక జేఏసీ చైర్మన్ కొదండరాంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. సింగరేణిలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే సర్వనాశనమని ఒకాయన మాట్లాడారు. అసలు జేఏసీకి పేరు పెట్టిందే నేను అని కేసీఆర్ కొదంరాంను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కొదండరాం తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని.. కనీసం ఆయన తన జీవితంలో సర్పంచ్ అయినా అయ్యాడా? అని ఎద్దేవా చేశారు. ఆయన ఓ విషపూరిత వ్యక్తి అని.. టీఆర్ఎస్ వ్యతిరేకి అని కేసీఆర్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం లక్ష ఉద్యోగాలకు బదులు మరో 12 వేల ఉద్యోగాలు అదనంగానే ఇవ్వబోతున్నాని కేసీఆర్ అన్నారు.

 

కాంగ్రెస్ పాలనతోనే మొత్తం పాలన నాశనం అయ్యిందని కేసీఆర్ తెలిపారు.నెహ్రూ దగ్గరి నుంచి సోనియా దాకా అంతా తెలంగాణను అన్యాయం చేసిన వారేనన్నారు. తాను దొరను కాదని, తక్కువ కులంలో జన్మించానని, ఉత్తమ్ కుమార్ రెడ్డే అసలైన దొర అని ఆయన చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని, స్వయంగా గవర్నరే వెళ్లి పరిశీలించి మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. పదేపదే దొర అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని, ఆ మాటకొస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డే అసలైన దొర అని, కులాలతో రాజకీయాలు ఎవరూ చేయలేరని కేసీఆర్ అన్నారు. తాను దొరను కాదని, తక్కువ కులంలో జన్మించానని, బలుపు ఉన్నోడే అసలైన దొర అని వ్యాఖ్యానించారు..  ప్రస్తుతం ఏ అజెండా ఎత్తుకోవాలో ప్రతిపక్షాలకు తెలియడం లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ తనపైనా, మంత్రుల పైనా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని, అక్కసుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్ కౌంటర్లు.. మత ఘర్షణలు లేవని.. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణ అభివృధ్ధి కొనసాగి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles