వైజాగ్, వైజాగ్ అంటూ చెవులు గిల్లుమనేలా అరుస్తూ.. ప్రయాణికులను అకర్షించి తమ బస్సుల్లో ప్రయాణించేలా చేసే ప్రైవేటు బస్సులు అడగాలు ఈ మధ్యకాలం శృతిమించిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాలుగా ప్రయాణికులకు చుక్కలు చూపిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు.. తాజాగా ఏకంగా ప్రయాణికులను అడవిలో అర్థరాత్రి సినిమాను లైవ్ గా చూపించారు. నిర్జన ప్రాంతంలో అసలేం జరుగుతుందో.. కూడా అర్థంకాని అయోమకస్థితిలోకి ప్రయాణికులు చేరకున్నారు. చివరకు నిలదీస్తే కానీ వెల్లడికాని నిజం విన్న ప్రయాణికులు విస్తుపోయారు.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లిన సిల్క్ లైన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. విజయవాడ, విశాఖపట్నానికి చెందిన ప్రయాణికులతో నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అర్థరాత్రి వేళ నల్లగొండ జిల్లా చిట్యాలకు సమీపంలో నిర్ఝన ప్రదేశానికి చేరకున్న వెంటనే బస్సు డ్రైవర్ బస్సును అర్థాంతరంగా నిలిపేశాడు. ఏం జరిగిందని అడిగిన ప్రయాణికులకు సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పిన బస్సు సిబ్బంది.. గంటన్నర లోపు రెడీ అవుతందని నమ్మబలికారు.
ఆ తరువాత గంటకు బస్సును వెనక్కు తిప్పి హైదరాబాద్ వైపు మళ్లించారు. అనుమానం వచ్చిన ప్రయాణికులు బస్సు డ్రైవర్ ను నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉన్నారని, ఇలా వెలితే గిట్టుబాటు కాదని…అందుకే బస్సును ఆపినట్లు చెప్పాడు. దీంతో ప్రయాణికులు బస్సులోనే జాగారం చేస్తూ నరకాన్ని చవిచూశారు. స్థానికుల సాయంతో తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులను మోసం చేసి.. మార్గమధ్యంలో వదిలేసినందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more