అనేక మలుపులు, తీవ్ర ఉత్కంఠ, అంతకుమించిన సస్సెన్స్ అన్ని కలగసిని అరుషి తల్వార్ హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులు డాక్టర్ నూపుర్ తల్వార్, రాజేశ్ తల్వార్ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో నోయిడా జంట హత్యల కేసులో పద్నాలుగేళ్ల అరుషీని, తల్వార్ ఇంటి పనిమనిషి నేపాల్ కు చెందిన హేమరాజ్ ను చంపిందెవరన్న విషయాం మాత్రం ఇప్పటికే స్పష్టం కాలేదు. గత తొమ్మిదేళ్లుగా మూడు పర్యాయాలు దర్యాప్తు సాగినా.. రెండు సార్లు సిబిఐ విచారణ జరిపినా ఈ కేసులో దోషులెవరన్నది మాత్రం తేల్చలేకపోయింది.
ఈ కేసులో సీబీఐ తల్వార్ దంపతులు దోషులని నిరూపించేందుకు సరైన ఆధారాలు చూపించలేదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో గత తొమ్మిదేళ్లుగా సంచలనాలకు కేంద్రబింధువుగా మారిన ఈ కేసులో ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదనే చెప్పాలి. అయితే 2013లో ఘజియాబాద్ సీబిఐ న్యాయస్థానం ఈ కేసు విషయంలో తీర్పును వెలువరించి.. తల్వార్ దంపతులను దోషులగా నిర్థారించి ఆ దంపతులకు జీవిత ఖైదు శిక్షను కూడా ఖరారు చేసింది.
దీంతో 2013 నుంచి దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు శుక్రవారం విడుదల కానున్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారిక వర్గాల ద్వారా తమకు తల్వార్ దంపతులను విడుదల చేయాలన్న అదేశాలు రావాలని.. అవి అందగానే వారిని విడుదల చేస్తామని దాస్నా జైలు అధికారులు తెలిపారు. కాగా తీర్పు కోసం ఎంతో ఉత్కంతగా జైలులోనే నిరీక్షిస్తున్న రాజేష్ తల్వార్ తమను కోర్టు నిర్దోషులుగా పరిగణించడంతో సంతోషంతో అనందబాష్పాలు రాల్చారని, జైలు సిబ్బందిని కౌగలించుకోగా, నుపూర్ తల్వార్ మాత్రం ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కనబడిందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more