OnePlus caught collecting sensitive user data మీది చైనా ఫోనేనా..? పర్సనల్ డేటా సేఫేనా..?

Oneplus caught collecting sensitive user data without permission

china phone, personal information, OnePlus, OnePlus 2, OnePlus 3, OxygenOS, OnePlus Privacy, How to OxygenOS, How to OnePlus, Chris Moore, security researcher

Security researcher claims OnePlus is gathering critical data such as serial number, IMEI number, wireless network IDs and timestamps for the screen on and screen off. Here’s how to keep your data secure.

మీది చైనా ఫోనేనా..? పర్సనల్ డేటా సేఫేనా..?

Posted: 10/12/2017 04:46 PM IST
Oneplus caught collecting sensitive user data without permission

చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ కంపెనీ ఫోన్ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సంస్థ వారి అనుమతి లేకుండా చౌర్యం చేస్తుందని ఆరోపణలను ఎదుర్కొంటుంది. అయితే ఈ అరోపణలను కంపెనీ వర్గాలు కూడా అంగీకరించిడం గమనార్హం. టైమ్ స్టాంప్, ఫోన్ యాక్టివేట్ అయిన తరువాత ఎప్పుడు స్టాండ్ బైగా వాడుతున్నామన్ని సమాచారంతో పాటు ఐఎమ్‌ఈఐ నంబర్లు, ఎంఏసీ అడ్రస్, ఫోన్ నెంబర్, వైర్ లెస్ నెట్ వర్క్, మొబైల్ నెట్ వర్క్ తదితర సమాచారాలను వన్ ప్లస్ దొంగమార్గంలో సేకరిస్తున్నందన్న సమాచారంతో కలకలం రేగుతుంది.

వన్ ప్లస్, వన్ ప్లస్ 2, వన్ ప్లస్ 3 ఫోన్ల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారని, అయితే తరువాత వచ్చిన వన్ ప్లస్ 2, 3 ల నుంచి అధికంగా వ్యక్తిగత సమాచారం ట్రాన్స్ ఫర్ అయినట్లు సెక్యూరిటీ రీసర్చర్ క్రిష్టోఫర్ మూరే వివరించారు. తన బ్లాగ్‌లో ఈ విషయంపై పూర్తి సమాచారం అందించారు. తమ వన్‌ప్లస్ ఫోన్లకు సంబంధించి వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలను, లోపాలను గుర్తించి.. వాటిని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చేసేందుకే సేకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తన ఫోన్‌లో డేటాను తస్కరించినట్లు క్రిష్టోఫర్ గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
అంతేకాదు, అలా దొంగిలించిన అతని వ్యక్తిగత సమాచారాన్ని వన్‌ప్లస్ కంపెనీ సొంత సైటైన అమెజాన్ ఏడబ్య్లూఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుర్తించాడు. ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో రాశాడు. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఎలా సేకరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సెట్టింగ్స్‌లో డేటా సేకరణను నిలువరించడానికి ఆప్షన్ ఉందని వన్‌ప్లస్ ఉచిత సలహాలివ్వడం ఇక్కడ కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china phone  personal information  OnePlus  OxygenOS  Chris Moore  security researcher  

Other Articles