హైదరాబాదు పాతబస్తీలోని మహిళ అమాయకత్వాన్ని అసరాగా చేసుకున్న ఓ దొంగబాబా భూతవైద్యం పేరుతో బూతు పనులు చేస్తున్నడటంతో అతడి ముసుగును ఓ మహిళ ధైర్యంగా తొలగింది. బూతు బాబాను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పగించింది. మహిళ చేసి సాహసోపేతమైన పనికి అమెకు అభినందలు వెల్లివిరువగా, పలువురు మతచాంధసవాదులు మాత్రం ఇంకా కళ్లు తెరువపోవడం గమనార్హం. ఇంతకీ ఈ మహిళ దొంగబాబా అటనెట్టా కట్టించిందబ్బా అంటే..
హర్యానాలో నిర్వహిస్తున్న మదర్సా కోసమని విరాళాల సేకరణ పేరిట హైదరాబాద్ నగరానికి చేరుకున్న మన్నన్ బాబా.. పాతబస్తీలో అమాయక మహిళలను టార్గెట్ చేసుకుని వారి అమాయకత్వంతో వారిని బూరిడీ కోట్టించవచ్చని భూతవైద్యుడి అవతారం ఎత్తాడు. హుమయూన్ నగర్ లో మకాం వేసిన ఇతగాడు.. తన వద్దకు వచ్చే అమాయక ముస్లిం మహిళలను గుర్తించి, వారికి శారీరిక, మానసిక సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తించేవాడు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తానని వారిని బుట్టలో వేసుకునే వాడు.
వారిలో అవహించిన సైతానును వదిలిస్తానని.. వారి నుంచి భూతవైద్యానికి కావాల్సిన ఖర్చులన్నింటినీ తీసుకునేవాడు. ఇలా వైద్యానికి వేరుగా, శాంతికి, పరిహారినికి వేర్వురుగా డబ్బులను తీసుకున్న తరువాత.. వైద్యం పేరుతో వారిని అభ్యంతకరంగా తాకుడూ.. లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. అయితే ఇదంతా వైద్యంలో భాగమని నమ్మిన పలువరు మౌనంగా వుండిపోగా.. ఓ మహిళ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా భూతవైద్యుడి అవతారాన్నే కట్టించివేసింది.
భార్యభర్తల మధ్య తరచూ మనస్పర్థలు వస్తున్నాయని.. వాటిని పరిష్కరించుకోవాలని ఓ మహిళ తనకు తెలిసిన వ్యక్తుల వద్ద తన అవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తమకు మగపిల్లాడి సంతానం కూడా కలగాలని వేచిచూస్తున్నామని.. కూడా చెప్పింది. అయితే భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. అన్ని సత్వరంగా సమకూరుతాయని తన పరిచయస్తులు సూచించడంతో.. అతడ్ని అశ్రయించింది. దీంతో వలకు చిక్కిన లేడిపిల్లలా ఆమెను అన్నిరకాలుగా వేధించాడు. అతని వేధింపులకు తాళలేకపోయిన ఆమె డీసీపీ వెంకటేశ్వరరావును ఆశ్రయించింది. దీంతో స్కెస్ వేసిన పోలీసులు, అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఆమె నుంచి 4 లక్షల రూపాయలను నకిలీబాబా దోచేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more