Kerala: CCTV helps to catch molester బరితెగించిన మగమృగం.. మహిళపై రేప్ అటెంప్ట్

Cctv captures assault on women in broad daylight man arrested

Jamsheer, Jams-heela Manzil, Thoppayil beach, Nadakkavu police, Koyilandy Government Hospital, molester, attempt rape, sexual assault on women, violence on women, crime on women, kozhikode, kerala, social media, crime

In a shocking video, a man is seen trying to molest a woman in an alley in Kerala's Kozhikode. The video of the incident has gone viral on social media.

ITEMVIDEOS: మిట్టమధ్యాహ్నం.. నడిరోడ్డుపై యువతిపై అత్యాచారయత్నం..

Posted: 10/23/2017 04:32 PM IST
Cctv captures assault on women in broad daylight man arrested

విశాఖ జిల్లాలో మతిస్థిమితం లేని యాచకురాలిపై నడిరోడ్డుపై అత్యాచారం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన మనవాళ్లకన్నా.. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై వెళ్తున్న యువతిని అటకాయించి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడి భరతం పట్టిన కేరళవాసులు సో బెటర్ అని చెప్పాలి. యువతిపై అత్యాచారానికి యత్నించిన మగమృగం అమె ప్రతిఘటించి.. బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే నిందితుడ్ని గుర్తించడంలో ఆ వీధిలోని ఇంటి యజమానులు ఏర్పాటు చేసుకున్న సిసిటీవీ కెమెరాలు దోహదపడ్డాయి.

సిసీటీవీ కెమెరా ఫూటేజీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన నడక్కవు పోలీసులు సదరు విధీలోని సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించి.. నిందితుడ్ని కోసం వేట ప్రారంభించారు. సీసీటీవీ పూటేజీ అధారంగా పైశాచిక మృగాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం.



ఈ నెల 18న సొంతూరు నుంచి తాను నివసించే హాస్టల్ కు తిరిగివస్తున్న యువతిని.. కన్నూర్ వయినాడ్ మార్గాలను కలిపే చిన్న వీధి గుండా వస్తుండగా, అమెను వెంబడించిన నిందితుడు జంషేర్  వీధి చివరకు వెళ్లాక.. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను పొదల్లోకి లాక్కెళ్లాలని యత్నించాడు. ఆమె గ‌ట్టిగా అరుస్తూ ప్రతిఘ‌టించ‌డంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ఆధారంగా జంషీర్ ను గుర్తించిన పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles