అధికారంలోకి రాకముందు హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని ప్రకటించుకున్న టీడీపీ అదినేత చంద్రబాబు.. అదే దీక్ష, పట్టుదలతో నవ్యాంధ్రప్రదేశ్ లోకూడా రాజధానిని అభివృద్ది చేస్తానని.. అందుకనే తనకు అధికారాన్ని అందించాలని అర్థించి.. అధికారంలోకి రాగానే రాజధాని లేని రాష్ట్రమంటూ అంగలార్చారని, ఇక అమరావతి నిర్మాణం విషయంలో అయన మదిలో అనేక అలోచనలు వరుగులు పెడుతున్నాయని ఈ విషయంలో ఆయా రంగ ప్రముఖులతో చర్చించాల్సిన చంద్రబాబు.. దానిని పక్కనబెట్టి సినిమావాళ్లతో చర్చలు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణమంటే సినీమా సెట్టింగ్ అని భావిస్తుందా అని ఐవైఆర్ వ్యంగంగా ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వంతో కుదర్చుకున్న స్విస్ ఛాలెంజ్ విధాన ఒప్పందం పూర్తిగా లోపభూయిస్టంగా వుందని, దానిని తక్షణం రద్దు చేసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చిరించిన ఆయన.. ఈ ఓప్పందంలో అనేక తప్పులు వున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఇబ్బందులు వస్తే ల్యాండ్ పుల్లింగ్ కింద భూములిచ్చిన రైతులే అధికంగా నష్టపోతారని హెచ్చరించారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు.
సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. కాగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ నగరం డిజైన్ల బాధ్యతను మొదట జపాన్ కు చెందిన మకి అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ అందించిన డిజైన్లు అద్భుతమంటూ ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆ డిజైన్లు బాగోలేవంటూ మకిని తొలగించారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రికి నచ్చలేదు. చివరకు ఫోస్టర్ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more