నవ్విపోదురు గాక నాకేటి సిగ్గూ అన్నట్లుంది ఇక్కడి బీజేపి నేతల వైఖరి. దానికి తోడు అక్కడి పోలీసుల వైఖరి కూడా. సభ్య సమాజంలో పాడు పనులు చేయడం.. అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా తమదేం తప్పులేదంటూ బొంకడం రాజకీయ నేతల వంతుగా మారుతుంది. మహారాష్ట్రలో ఓ బీజేపి నేత ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బస్సులోనే అమెపై లైంగికకర చర్యలకు పాల్పడిన ఘటన ఇటీవల వెలుగుచూడగా, అయనపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన బీజేపి ఎం చర్యలు తీసుకుందో తెలియదు.
అయితే ఓ దొంగతనం కేసులో నిందితుడిగా వు్న వ్యక్తిని కాపాడుతానని చెప్పి ఓ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నిందితురాలి తల్లి నుంచి యాభై వేల రూపాయలు తీసుకుని చేతులెత్తేసింది. ఈ విషయంలో మాత్రం సీఎం దృష్టికి కేసు వెళ్లగా, ఆయన అదేశాలపై అమెను అరెస్టు చేశారు. ఇక అధికార పార్టీ నేతలు సాగించే అగడాలు ఎన్నెన్నో జరుగుతున్నా పెద్దగా బీజేపి పాలిత రాష్ట్రాల్లో చర్యలు మాత్రం తీసుకున్నట్టుగా లేదు. బీజేపి కౌన్సిలర్ భర్త, బంధువులు తమవారి వాహనాలను అపినందుకు ట్రాపిక్ కానిస్టేబుళ్లపై దాడులు చేసిన ఘటనలో ఏం జరిగిందో తెలియదు.
ఒకటి రెండు ఘటనల్లో చర్యలు తీసుకున్నా.. చిన్నా చితకా నేతలపై చర్యలను తీసుకుంటున్నారే తప్ప.. రాష్ట్రమంత్రులపై అరోపణలు వస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు.. వారిని వెనకేసుకుని వస్తున్నాయి ప్రభుత్వాలు, పార్టీ నేతలు. ఛత్తీస్ గఢ్ లో ఓ మంత్రి రాసలీలల కుంభకోణం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో తన దగ్గర ఉందని ఆరోపణలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ అరెస్టయిన కాసేపటికే ఈ వ్యవహారం వెలుగులోకి రావటం విశేషం.
బీబీసీ మాజీ పాత్రికేయుడు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడైన వినోద్ వర్మ తన దగ్గర ఓ ముఖ్యనేతకు సంబంధించిన సెక్స్ క్లిప్ ఉందంటూ ప్రకటించాడు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు జర్నలిస్ట్ ఇలా చేస్తున్నాడని బీజేపీ ఐటీ సెల్ నేత ప్రకాశ్ బజాజ్.. జర్నలిస్టు వినోద్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘజియాబాద్‌లో వినోద్ ను అరెస్ట్ చేశారు. అతని నివాసంలో సోదాలు జరిపి ఏకంగా రెండు లక్షల రూపాయల నగదు, 500లకు పైగా సెక్స్ సిడీలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం అదేశాల మేరకు తనను అరెస్టు చేస్తున్న పోలీసులది కూడా కేవలం కక్షపాధింపు చర్యేనని అరోపించిన అయన.. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో మాత్రం ఆ మంత్రి పేరును ప్రకటించేశారు. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మంత్రి పేరు వెల్లడించారు. సెక్స్ వీడియోలో ఉంది పీడబ్ల్యూ శాఖా మంత్రి రాజేష్ మునత్ అంటూ వ్యాఖ్యానించారు. పవర్ ఫుల్ మంత్రికి సంబంధించిన సెక్స్ స్కాండల్ కావటంతో.. కావాలనే తనని ఇరికించినట్లు వినోద్ పేర్కొన్నట్లు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more