తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ మాజీ నేత అనుముల రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా 18 మంది టీడీపీ సీనియర్ నేతలు, టీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్వర్యంలో రేవంత్ సహా 18 మంది నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.
తెలంగాణ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అనేక ఒత్తిళ్లకు ఒర్చినా.. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిందని ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ భావజాలాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ టీడీపీ, టీఆర్ఎస్ నేతల చేరికలు వుంటాయని ఆకాంక్షించిన ఆయన అందరినీ కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా భావిస్తామని అన్నారు. అందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నేతలు వి.హన్మంతరావు, మధుయాష్కిగౌడ్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మల్లు రవి, కుసుమ కుమారి తదితరులు కూడా పాల్గొన్నారు.
రేవంత్ తో పాటుగా చేరిందేవరు..?
టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, సీతక్క, బోడ జనార్థన్, వేం నరేందర్‌రెడ్డి, అరికెలనర్సారెడ్డి, సోయం బాపురావు, కవ్వంపల్లి సత్యనారాయణ, సత్యం, జంగయ్య, హరిప్రియా నాయక్, బిల్యా నాయక్, శశికళ, రాజారాం యాదవ్, పటేల్ సుధాకర్‌రెడ్డి, రమేశ్, విజయరమణా రావులు, టీఆర్ఎస్ పార్టీ నుంచి దొమ్మాటి, విద్యార్థి, యువజన ఉద్యమనాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, మధుసూదన్‌లు కాంగ్రెస్‌లోకి చేరినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more