Anupama Shenoy launches party రాజకీయ పార్టీని స్థాపించిన అనుపమ షెణై..

Karnataka one more party by ex cop anupama shenoy

Kudligi DSP, Ex-cop, Anupama Shenoy, P.T. Parameshwara Naik, former Minister, Kannada Rajyotsava Day, Bharatiya Janashakthi Congress (BJC)

Former DSP of Kudligi Anupama Shenoy, who left the police force following a spat with former Minister, launched her new political party named Bharatiya Janashakthi Congress (BJC) at Kudligi town in the district on Kannada Rajyotsava Day

మరో కొత్త రాజకీయ పార్టీ.. స్థాపించిన డీఎస్సీ..

Posted: 11/02/2017 11:52 AM IST
Karnataka one more party by ex cop anupama shenoy

కర్ణాటకలో ప్రముఖ హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన రోజుల వ్యవధిలోనే మరో కొత్త రాజకీయ పార్టీ కూడా అవిష్కృతమైంది. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష పార్టీని ఉపేంద్ర స్థాపించిన మరుసటి రోజునే అక్రమార్కుల గుండెళ్లో రైలు పరిగెత్తించిన కూడ్లిగి మాజీ డీఎస్పీగా అనుపమ షెణై రైలు మరో కొత్త పార్టీని స్థాపించారు. కర్ణాటక మాజీ మంత్రి పరమేశ్వరన్ నాయక్ తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో అమె తన ఉద్యోగానికి కూడా రాజీనామ చేసి మరీ పోరాడారు.

తాను ఎక్కడ పోగొట్టకున్నానో.. అక్కడే వెతకాలని నానుడిని అర్థం చేసుకున్న అనుపమ.. తాను రాజకీయ నేతలతో పోరులో పోగొట్టకుకన్న పరపతిని, పరువుప్రతిష్టలను అక్కడే సంపాదించాలని అమె రాజకీయ పార్టీని స్థాపించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన క్రమంలోనే అమె రాష్ట్రంలోని విపక్ష పార్టీలలో ఏదోఒక పార్టీని అశ్రయిస్తారని వార్తలు వచ్చినా.. వాటిని అమె ఖండిస్తూ తనదైన శైలిలో నూతనంగా భారతీయ జనశక్తి కాంగ్రెస్ పేరును రాజకీయ పార్టీని స్థాపించారు.

కర్ణాటక రాజ్యోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమె కూడ్లిగిలో పార్టీని స్థాపించారు. తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ పేరును ప్రకటించారు. కేసరి, తెలుపు, పచ్చ రంగులతో రమారమి జాతియ జెండాను పోలిన విధంగా... మధ్యలో భారతదేశ అకారం వున్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. కూడ్లిగిలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నికి నివాళులు అర్పించిన తరువాత అమె తన కొత్త పార్టీని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. తమ పార్టీకి ప్రజలు మద్దతు ఉంటుందని తెలిపారు. కర్ణాటకను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేలా తమ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని, అసెంబ్లీలో అడుగుపెడతామని తెలిపారు. 80 లేదా అంతకన్నా స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అనుపమ షెణై చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles