Stalin to lead protest aginast demonetisation in Madurai అలా పరామర్శించి వెళ్లగానే.. ఇలా జలక్..

Stalin to lead protest aginast demonetisation in madurai

Congress, DMK, M K Stalin, madurai, black shirts, note ban, Kanimozhi, Coimbatore, Black Day, Demonetisation, Madurai, Tamil Nadu, politics

BJP sources dismissed any political significance in PM Modi calling on M Karunanidhi in Chennai described it as a courtesy call DMK calls for note band protest with black shirts.

అలా పరామర్శించి వెళ్లగానే.. ఇలా జలక్..

Posted: 11/07/2017 03:26 PM IST
Stalin to lead protest aginast demonetisation in madurai

భారతదేశ రాజకీయ కురువృద్దులలో ఒకరైన డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆయనను మర్యాద పూర్వకంగా కలసి వెళ్లడంతో రెండు రోజుల క్రితం ఈ పరిణామం నేపథ్యంలో తమిళనాట మీడియాలో వచ్చిక కథనాలు అనేకం. డీఎంకేతో రాజకీయ సయోద్య కురిదిందన్న వార్తలు కూడా షికారు చేశాయి. అయితే ఇది జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే డీఎంకే ఈ వార్తలన్నింటినీ తోసిపుచ్చేలా నవంబర్ 8న నోట్ల రద్దును చేపట్టిన ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పక్షాలన్నీ చేపట్టనున్న అందోళనలకు తాము కూడా సిద్దమని డీఎంకే పార్టీ సంసిధ్దతను వ్యక్తం చేసింది.

డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ సందర్భంగా రేపు పార్టీ నేతలు ఏక్కడెక్కడ నిరసనలు, అందోళనకు పూనుకోవాలన్న వివరాలను తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు అందరూ రేపటి కరప్పు దినం (బ్లాక్ డే) కు నల్లని చోక్కాలను ధరించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసి సంవత్సరం కావస్తున్న సందర్భంగా తమిళనాడులోని మధురైలో జరిగే నిరసన కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొననున్నారు.

స్టాలిన్ సోదరి, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కోయంబత్తూర్‌లో జరిగే ఆందోళనలో పాల్గొననున్నట్టు వెల్లడించింది. ఇక పార్టీ సీనియర్ లీడర్ దురాయ్ మురుగన్, పెరియాసామిలు తిరుచునాపల్లి, దిండిగుల్ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలలో పాల్గోంటారని డీఎంకే వర్గాలు తెలిపాయి. డీఎంకే, కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  DMK  M K Stalin  madurai  black shirts  note ban  Kanimozhi  Coimbatore  Black Day  Demonetisation  Madurai  Tamil Nadu  politics  

Other Articles