ఎన్ని విమర్శలోచ్చినా.. ఎందరేమన్నా.. నీవు మాత్రం నీ సిబ్బందితో చేయించు చెప్పులు మోయు పనులను అన్నట్లు కేంద్రమంత్రులు తమ సిబ్బందితో ఈ పనులను చేయిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎంను వరద ప్రభావిత ప్రాంతాల్లో మోసుకెళ్లిన వైనంతో పాటు అనేక కేంద్రమంత్రులు తమ చెప్పులను వ్యక్తిగత సిబ్బందితో మోయించి వార్తల్లొ నిలిచారు. విమర్శలు రావడం.. అవమానంగా తోచడంతో దానికి సారీ అనో లేక అలా కాదు అసలేం జరిగిందంటే అనో సంజాయిషీలు ఇచ్చుకున్నారు.
ఇక తాజాగా, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తన వ్యక్తిగత సిబ్బందితో తన బూట్లు మోయించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శితో, రాయగడ జిల్లాలో శివాలయం వద్ద షూస్ మోయించిన ఘటన కెమెరాలో చిక్కింది. ఈ వీడియో ఫుటేజీలు బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫోటోలు అటు సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ కాగా, వాటిపై నెట్ జనులు ఒక్కక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
మంత్రి జువల్ ఓరంతో పాటు సీనియర్ నేతలు పార్టీ వర్కర్ల సమావేశానికి హజరు కావడానికి వెళ్లారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ కి దగ్గర్లో శివాలయం ఉంది. సమావేశ వెన్యూకి వెళ్లడానికి ముందు, మంత్రి, నేతలు, ఇతర అధికారులు, వారి కాళ్లకు వున్న బూట్లను, చెప్పులను ఆలయానికి బయట విడిచి దేవాలయ దర్శనానికి వెళ్లారు. దేవుడిని దర్శించుకున్న అనంతరం లీడర్లు, వర్కర్లు తమ బూట్లు వేసుకొని కమ్యూనిటీ హాల్ కు బయలుదేరారు.
ఈ క్రమంలో మంత్రి ఓరం మాత్రం ఆలయం నుంచి అక్కడే వున్న కమ్యూనిటీ హాలులోని సభావేదిక వద్దకు ఒట్టి కాళ్లతో నడుచుకుంటూ వెళ్లారు. ఆయన పీఏ మాత్రం మంత్రి గారి షూస్ పట్టుకుని, వెనక్కే నడుచుకుంటూ వెళ్లాడు. కమ్యూనిటీ హాల్ వద్ద మంత్రి తన షూస్ వేసుకుని, సమావేశానికి హాజరయ్యారు. సకాలంలో తన బూట్లను తీసుకురాలేదన్న రివెంజ్ ను మంత్రి ఫీఏపై తీర్చుకున్నారని ఒకరు.. ఓరాం సాబ్ కు ఇది అలావాటేనని, మరింంత కోసం వస్తే ఏకంగా కొట్టేస్తారని కొందరు.. అధికారంలో వుంటే ఇలా చేయపపోతే ఎలా అంటూ ఇంకోందరూ నెట్ జనలు కామెంట్లు ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more