సింహాచలం దేవస్థానం అధికార పనితీరుతో మళ్లీ వార్తలో నిలిచింది. ఇప్పటికే అలయానికి చెందిన భూముల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు భూ పరిరక్షణ విభాగం ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసి.. ఉద్యోగులను విధుల నుంచి బహిష్కరించిన ఈవో రామచంద్ర మోహన్.. ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆలయ ఉద్యోగులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజగా అత్యంత పవిత్రంగా భావించే సింహాచల అప్పన్న ప్రసాదంలో బొద్దింక రావడం భక్తులలో తీవ్ర కలకలం రేపుతుంది.
పెందుర్తికి చెందిన అయ్యప్ప స్వామి భక్తుడు శబరిమల యాత్రకు బయలుదేరి మార్గమధ్యంలో విశాఖ జిల్లా సింహాచలేశ్వర అప్పన్నస్వామి కొండకు విచ్చేసి అక్కడ భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలలో పాల్గోన్నాడు. అనంతరం ఆలయం ప్రసాద విక్రయాల కౌంటర్ వద్దకు వచ్చి తన కోసం, తన సహచర అయ్యప్పస్వామి భక్తుల కోసం పులిహోరా ప్రసాదాన్ని తీసుకున్నాడు. అయితే తాను తీసుకన్న ప్రసాదంలో బొద్దింకా వుండటాన్ని గమనించారు. వెంటనే ప్రసాదాల కౌంటర్ లోని సిబ్బందికి పిర్యాదు చేశారు.
దీంతో సిబ్బంది అయ్యప్ప భక్తుల నుంచి ప్రసాదాన్ని వెనక్కి తీసుకుని మరో ప్రసాదాన్ని ఇచ్చారు. అయితే అలయ అధికారులు తీరుతో భక్తులు ఖంగుతిన్నారు. ప్రసాదం ప్యాకెట్ మారినంత మాత్రాన లాభం లేదని.. మొత్తం ప్రసాదాన్ని ఒకేసారి చేస్తారుగా అని భక్తులు నిలదీశారు. దీంతో ప్రసాదం ప్యాకెట్లను తీసుకున్న సిబ్బంది వారికి లడ్డూ ప్రసాదాన్ని అందజేసినట్లు సమాచారం.
కాగా అత్యంత భక్తిశ్రద్దలతో చేసిన ప్రసాదాన్ని దేవదేవుడికి సమర్పించిన తరువాత భక్తులకు వితరణ చేస్తారు. అయితే అలాంటి ప్రసాదంలో బొద్దింక రావడంతో తమ భక్తి విశ్వాసాలతో ఆలయ అధికారురులు అడుకుంటున్నారని భక్తులు మండిపడుతున్నారు. దేవుడికి కూడా నాన్ వెజ్ ప్రసాదాన్ని పెట్టారా..? లేక భక్తుల కోసమే ఇది ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారా.. అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మాత్రం కనీస బాద్యత లేకపోవడంపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more