భారీ భూకంపం ఇరాన్-ఇరాక్ సరిహద్దులను అతలాకుతలం చేసింది. 140 మృతి చెందినట్లు.. వేల మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి తీవ్రత ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు చూపుతోంది. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది.
ఇరు దేశాల మధ్య ఉన్న హలాబ్జా ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. రిక్చర్ స్కేలుపై 7.3 తీవ్రత చూపిస్తోంది. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భూమి కంపించి పోవడంతో భయంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు. శిధిలాలకింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
భూకంపం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు భవంతులు, లిఫ్ట్ లకు దూరంగా ఉండాలని ఇరాక్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషస్ ఇరాకీ స్టేట్ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్, లెబనాన్, కువైట్, టర్కీలలో కూడా భూమి కంపించినట్టు సమాచారం.
While the center of tonight's #earthquake is reported to be #Iran Kurdistan, this is a footage from Kelar town in #Iraq Kurdistan. #ErdhejKurdistan #Kurdistan #زلزله pic.twitter.com/D7MyBqn1uh
— Herbert Maddison (@Herb_Maddison) November 12, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more