హైదరాబాద్ మహానగరంలో జరగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందువల్లే యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుసుకున్న పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూవీలర్స్ పై ట్రిపుల్ రైడింగ్ చేసే యువతను కట్టడి చేయాలని భావిస్తుంది. ఇకపై ద్విచక్రవాహనాలపై ట్రిఫుల్ రైడింగ్ చేసే ముగ్గరికి జరిమానా వేయాలని యోచిస్తుంది.
సాధారణంగా ఇప్పటివరకు కేవలం వాహనం నడిపే వ్యక్తిపై మాత్రమే కేసులు వేసి జరిమానా కట్టించుకునేవారు. అయితే ఈ నిబంధనను కాసింత కఠినతరం చేయాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. దీంతో ప్రమాదాలకు అడ్డకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని.. ముగ్గురిపైనా జరిమానా విధించాలని అధికారులు యోచిస్తున్నారని సమాచారం.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రిపుల్ రైడింగ్ కేసుల వివరాలతో ఒక నివేదికను రూపొందించి ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు.. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే అనర్థాలు, పరిణామాల గురించి సమగ్రంగా ఆ నివేదికలో పేర్కొననున్నారు. తమ నివేదికలో నగరశివార్ల పరిధిలోనే యువత అధికంగా ట్రిఫుల్ రైడింగ్ చేస్తుందని కూడా గుర్తంచారు.
రాచకోండ కమీషనరేట్ పరిధిలో కేవలం 5 నెలల్లోనే 10 వేల ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేసి.. రూ. 10లక్షల మేర జరిమానాలు విధించారంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. దీంతోనే చట్టాన్ని కఠినతరం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారి అధికారులు. ఇకపై ట్రిపుల్ రైడింగ్ కేసులో వాహనచోదకుడితో పాటుపాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more