హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందని, అయితే ఈ ప్రాజెక్టు దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు తాము సన్నహాలు చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇంకా వెలువడలేదని దానికోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. అన్ని అనుకూలిస్తే ఈ నెల 28న ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాము అన్ని విధాల సిద్దంగా వున్నామన్నారు.
తొలిదశలోనే ఏకంగా 30 కిలోమీటర్లు మేర మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్రారు. అసెంబ్లీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలుచేశారు. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రాజెక్టు నిర్మాణంలో అసాధారణ జాప్యం ఎన్నడూ జరగలేదన్నారు. తొలిదశ తరువాత ఫేజ్ 2కి కూడా త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పాతబస్తీపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. మెట్రో నిర్మాణంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతుందన్నారు.
ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిఫ్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకోచ్చిన కేటీఆర్.. ఈ ప్రాజెక్టు కోసం తమ సర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు 2,240 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. కాగా కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందని అయితే ఇప్పటివరకు రూ. 958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని తెలిపారు. దేశ చరిత్రలో 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభించడం కూడా ఇదే తొలిసారని కేటీఆర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more