హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటించిన నాలుగు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భాగస్వామ్య వ్యాపారంలో తనకు తెలియకకుండా తనకు చెందిన భూములను విక్రయించి.. మోసం చేశారంటూ నాగార్జున సోదరి నాగసుశీల.. చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్ తో పాటుగా మొత్తంగా 13 మందిపై కేసు నమోదు చేసిన పోలిసులు దర్యాప్తు ప్రారంభించారు.
వీరిద్దరూ 12 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. శ్రీనాగ్ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో వీరిద్దరూ కలసి సినిమాలను కూడా నిర్మించారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా, కాళిదాసు, కరెంట్, అడ్డా తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఇద్దరూ కలసి రియలెస్టేట్ వ్యాపారాలు కూడా చేశారు. అయితే, గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
ఇటీవల తెరకెక్కిన 'ఆటాడుకుందాం రా' సినిమా విషయంలో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. నాగార్జున చొరవతో ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినా, అవి ఫలించలేదు. వీరి విభేదాలకు సంబంధించి ఓ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. కేసు కోర్టులో ఉండగానే ఆయనపై నాగ సుశీల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ చేశారంటూ శ్రీనివాస్ తో పాటు మరో 13 మందిపై ఆమె కేసు పెట్టారు. కాగా, మరో నాలుగు రోజుల తరువాత తాను బయటకు వస్తాని, అప్పుడు అన్ని విషయాలను మీడియా ముందుకు వచ్చి చెబుతానని శ్రీనివాస్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more