Man involved with fake currency racket arrested రూ.2వేల నోటు కేవలం రూ.900లకే.. నకిలీవే..

Fake rs 2k notes from pakistan at rs 900

Fake notes, Rs 2000 note, Fake Rs 2000, Demonetisation, fake currency, Counterfeit currency, Rs 2000 notes, Rs 900,Rs 2000, Racket, Pakistan, Malda, Fake currency, crime news, latest news

The Delhi police seized 330 fake notes in denomination of Rs 2,000 after a tipoff. The counterfeits had most of the security features of the new currency notes.

నకిలీ కరెన్సీ గుట్టు రట్టు.. రూ.2వేల నోటు కేవలం రూ.900

Posted: 11/18/2017 04:42 PM IST
Fake rs 2k notes from pakistan at rs 900

దేశరాజధానిలో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టయింది. నకిలీ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని గురువారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడిని విచారించగా అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్‌ నుంచి తీసుకొస్తున్నట్లు సదరు నిందితుడు చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నకిలీ నోట్ల వ్యవహారంలో పశ్చిమ్‌బంగాకు చెందిన కాషిద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. నిఘా సంస్థల సమాచారంతో దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కాషిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రూ. 6.6లక్షల విలువ చేసే 330 నకిలీ రూ.2000 నోట్లను గుర్తించారు. కాగా.. గత 15ఏళ్లుగా తాను ఈ దందాలో ఉన్నట్లు కాషిద్‌ విచారణ సమయంలో చెప్పాడు. దిల్లీ, యూపీ, బిహార్‌లకు ఈ నోట్లను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు.

అయితే ఈ నోట్లను తాను పాకిస్థాన్‌ నుంచి తీసుకొస్తున్నట్లు కాషిద్‌ వెల్లడించాడు. పాక్‌కు చెందిన ఓ వ్యక్తి బార్డర్‌ ఫెన్సింగ్‌ నుంచి ఈ డబ్బులను భారత్‌ వైపు విసిరేస్తాడని చెప్పాడు. 100నోట్లకు రూ.30 చొప్పున తాను ఈ నోట్లను కొనుగోలు చేసి తర్వాత రూ. 45 చొప్పున విక్రయిస్తానని తెలిపాడు. అయితే తాజా రూ. 2000 నకిలీ నోట్లను మాత్రం రూ. 900లకు విక్రయించినట్లు అంగీకరించినట్లు కాషిద్‌ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టామని.. ఇందులో పాక్‌ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake notes  Rs 2000 note  Fake Rs 2000  Demonetisation  fake currency  Counterfeit currency  

Other Articles