Australia puts India in moderate-risk category భారతీయ విద్యార్థులకు అస్ట్రేలియా తీపికబరు..

Australia raises indian students rating for immigration

higher studies in austrlia, australian universities, australia raises indian immigration rating, india moderate risk category, Indian students, Immigration, moderate risk category, higher studies, Australia, India

Indian students will find it easier to go to Australia to pursue higher education. This was after a recent ruling that granted India a higher ‘immigration rating’ within Oz.

భారతీయ విద్యార్థులకు అస్ట్రేలియా తీపికబర్...

Posted: 11/20/2017 11:33 AM IST
Australia raises indian students rating for immigration

భారతీయ విద్యార్థులకు అస్ట్రేలియా తీపికబరును అందించింది. ప్రపంచ వ్యాప్తంగా భారత విద్యార్థులు విద్యా, ఉద్యోగాలలో చాటుతున్న ప్రతిభను గమనించిందో లేక అదాయాన్ని సమకూర్చుకోవడానికి చేసిందో తెలియదు కానీ మన విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆస్ర్టేలియా ప్రభుత్వం పలు ఆకర్షణీయ చర్యలు తీసుకుంది. ఇప్పుడు వున్న ‘హై రిస్క్‌ అసె‌స్ మెంట్‌’ను ‘మోడరేట్‌ రిస్క్‌’ కేటగిరీకి మార్చింది. దీంతో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వైపు చూస్తున్న మన విద్యార్థులల్లో కొత్త అశలు చిగురింపజేసింది. ఈ కేటగిరి మార్పుతో స్టూడెంట్‌ వీసా పొందేందుకు కూడా మార్గం సులువైనట్లే.

తాజాగా చేసిన ఈ మర్పుతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ దేశంలోకి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వివిధ దేశాల విద్యార్థులను రిస్క్‌ ప్రాతిపదికన నాలుగు కేటగిరీలుగా విభజించిన ఆస్ట్రేలియా.. భారతను మోడరేట్ రిస్క్ క్యాటగిరిలోకి మార్చింది. దీంతో కేటగిరీని బట్టి డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. గతంలో హై రిస్క్ గా వున్న భారతీయులు అస్ట్రేలియాకు వెళ్లాలంటే అనేక డాక్యుమెంట్లను పోందపర్చాల్సి వచ్చేది.

అయినా ఆస్ట్రేలియాలోని ఎక్కువ కాలేజీలు,ఇతర విద్యాసంస్థలను ఎంపిక చేసుకునే ఆప్షన్లు మాత్రం భారత విద్యార్థులకు మాత్రం తక్కువగానే ఉండేవి.ఇక మాడరేట్ రిస్క్ లోకి భారతను చేర్చడంతో.. ఇకపై ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకున్‌ విద్యార్థులు ఎంబసీ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను మాత్రమే సమర్పించాలి. అయితే సదరు దరఖాస్తుదారుడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డాక్యుమెంట్లను అడిగే అధికారం వీసా అధికారికి ఉంటుంది.
 
ఆస్ట్రేలియాలోని వర్సిటీలకు నాణ్యత ప్రాతిపదికన ర్యాంకింగ్‌ ఉంటుంది. దేశానికి ఇచ్చిన కేటగిరీ సంఖ్యను దరఖాస్తు చేసుకున్న వర్సిటీకి అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం మన దేశానికి ఇచ్చిన కేటగిరీతో భారత విద్యార్థులు ఎక్కువ వర్సిటీలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి. 2025 నాటికి 7,20,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను తమ వర్సిటీల్లో చేరేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అమెరికా, బ్రిటన్‌ తర్వాత ఆస్ట్రేలియాలోనే అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువగా ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian students  Immigration  moderate risk category  higher studies  Australia  India  

Other Articles