Woman Burqa Removed in CM's Meeting | ధృతరాష్ట్ర సభను తలపించిన సీఎం సభ

Muslim woman asked to remove burqa at yogi adityanath s ballia rally

muslim woman, woman asked to remove burqa, burqa, Yogi Adityanath, burqa-clad woman, BJP activist, black clothes, Anil kumar, Ballia, Uttar Pradesh

Police asked a woman to remove her burqa at a rally attended by Chief Minister Yogi Adityanath in Uttar Pradesh's Ballia.

ITEMVIDEOS: ముఖ్యమంత్రి సభలో ముస్లిం మహిళకు పరాభవం..

Posted: 11/22/2017 03:46 PM IST
Muslim woman asked to remove burqa at yogi adityanath s ballia rally

ఆ ముఖ్యమంత్రికి నల్లపు రంగు దుస్తులను ఎవరూ చూపించవద్దని అదేశాలు వున్నాయి. అయితే ఈ విషయం తెలియని ఓ బీజేపి కార్యకర్త ఆయన సభకు వెళ్లింది. ఓ వైపు సభ ప్రారంభ సన్నాహాలు జరుగుతుండగా, అమెకు మాత్రం ఆ సభ. దృతరాష్ట్ర సభను తలపించింది. మన సీఎం సభకు వెళ్లాలని మనస్సు నిండా సంతోషం, అనందంతో వచ్చిన మహిళకు నిండు సభలో పరాభవం ఎదురైంది. అప్పట్లో పాలకుల చేత ద్రౌపతికి పరాభవం ఎదరైతే.. ఇప్పుడు మాత్రం పోలీసుల చేతిలో మహిళకు చేదు అనుభవం ఎదురైంది.

ఈ ఉతంతానికి కారణమైంది ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ఓ ముస్లిం మహిళా కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. సభకు హాజరైన ఆ మహిళ బుర్ఖాను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనపై బాలియా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు.  అయితే మహిళను బుర్ఖా తొలగించించాలన్న ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందలేదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు బుర్ఖాను ఎందుకు తొలగించాలని పోలీసులు...ఎందుకు ఆదేశించారో తనను  తెలియదని ఆ ముస్లిం మహిళ పేర్కొంది. అయితే ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం. మీరట్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో కొందరు సీఎం యోగికి వ్యతిరేకంగా నల్ల జెండాలను చూపించారు. అయితే ఆ ఆందోళన కారులను.. బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముస్లిం మహిళను బుర్ఖా తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muslim woman  Yogi Adityanath  burqa  BJP activist  black clothes  Anil kumar  Ballia  Uttar Pradesh  

Other Articles