Nurse gang-raped in Bareilly of Uttar pradesh నర్సుపై మగమృగాళ్ల సామూహిక అత్యాచారం..

Three held for nurse gangrape in bareilly of uttarpradesh

Gangrape cases in Uttar Pradesh, nurse gangraped in Uttar Pradesh, Gangrape cases in India, Rohilkhand Medical College nurse gangraped, 3 people gangrape nurse in Bareilly, Gangrape, rape, nurse, Rohilkhand Medical College, Bareilly, uttar pradesh, crime

The Uttar Pradesh police arrested 3 persons for allegedly gang-raping a nurse in Bareilly, who abducted and gang-raped the Rohilkhand Medical College nurse.

నర్సుపై మగమృగాళ్ల సామూహిక అత్యాచారం..

Posted: 11/24/2017 03:18 PM IST
Three held for nurse gangrape in bareilly of uttarpradesh

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా".. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలూ, పెద్దలూ పదే పదే చెబుతుంటారు. కానీ స్త్రీలను గౌరవించే మన పుణ్యభూమిలో అందులోనూ శ్రీరాముడు ఏలిన అయోధ్య రాజ్యంలోనే స్త్రీలకు కష్టం వచ్చిపడింది. అయినా దానిని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. మహిళలను అంగడి వస్తువులుగా, అటవస్తువులుగా చూసే మగమృగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతు పోతుంది.

వ్యాధులకు కర్మ సిద్దాంతాలకు ముడిపెట్టే అమాత్యులు.. జరుగుతున్న దారుణాలను మాత్రం నిలువరించలేకపోతున్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, పాలకులకు లేదా అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఎంతటి అపదలో వున్నవారికైనా సేవలందించే ఓ అసుపత్రి నర్సును అగంతకులు అపహరించుకుని వెళ్లి నిర్జన ప్రాంతంలో అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది.

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో అందుబాటులోకి వచ్చిన వివరాల మేరకు బాధితురాలు రోహిల్ ఖండ్ మెడికల్ కాలేజీలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఆ రోజు కూడా తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ముగ్గరు పైశాచిక మృగాళ్లు అమెను మార్గమధ్యంలోంచి అపహరించుకుని పోయి నిర్జన ప్ర్రాంతంలో అమెపై సామూహికంగా అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను విచారిస్తున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangrape  rape  nurse  Rohilkhand Medical College  Bareilly  uttar pradesh  crime  

Other Articles