అమెరికా అధ్యక్షుడి కుటుంబం గురించి మీడియాకు నిరంతరం ఆసక్తే. అయితే వీరి విషయంలోనే కాకుండా మాజీ అధ్యక్షుల విషయంలో కూడా మీడియా అనేక పర్యాయాలు ఎంటరైంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మీడియా బయటపెట్టిన విషయాలు నానా రచ్చను సృష్టించాయి. మాజీ అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించి విషయంలో వేలుపెట్టిన మీడియా.. తీరా తాను పెట్టిన వార్తను కనిపించకుండా చేయడంతో తో పాటు అనేక విమర్శలను ఎదుర్కోంది.
ఇంతకీ ఏం జరిగిందీ.. అసలు ఆ మాజీ అధ్యక్షుడు ఎవరూ..? అంత రచ్చ చేసిన విషయం ఏంటీ అనేగా మీ డౌట్స్.. వివరాల్లోకి వెళ్తే.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కూతురు మలియాను ఉన్నత చదువుల కోసం అమె తండ్రే స్వయంగా అమెను యూనివర్సిటీలో దింపివెళ్లారు. అప్పుడాయన కళ్లలో నీళ్లు గుండ్రగా తీరిగాయన్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే అందుకు సంబంధించి కొన్ని తాజా వార్తలను అక్కడి మీడియా ప్రసారం చేసింది.
మలియా ఒబామా పొగ తాగుతున్నట్లు, గుప్పు గుప్పున పోగను రింగిలు రింగిలుగా గాల్లోకి వదులుతున్నట్లు కథనాన్ని ప్రచురించిన మీడియా అంతటితో అగకుండా అమె తన భాయ్ ఫ్రెండ్ ముద్దాడుతున్నట్లు ఉన్న ఫొటోలను అగ్రరాజ్య మీడియా ప్రసారం చేసింది. ఈ ఫోటోలు, కథనాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రచ్చ రచ్చ చేశాయి. దీనిపై పై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియాలు మాలియాకు అండగా నిలిచారు.
అమెరికన్ మీడియాపై వీరిద్దరూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్ల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. వారేం అన్నారంటే.. 'మలియా ఒబామా ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి. వ్యక్తిగత గోప్యత ఆమె హక్కు. మీడియా తన హద్దుల్లో ఉండాలి' అని ఇవాంకా ట్వీట్ చేయగా, 'ఒక యువతిగా, విద్యార్థినిగా, సాధారణ వ్యక్తిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదు. మీడియా కాస్త ఉన్నతంగా ప్రవర్తించండి' అని చెల్సియా క్లింటన్ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more