facebook reveals conistable's cheating కానిస్టేబుల్ బండారాన్ని బయటపెట్టిన ఫేస్ బుక్..

Facebook reveals conistable s cheating

conistable gopi krishna, lady conistable raavuri vimala, love affair, dowry, facebook, cheating, marriage, social media, g.konduru, krishna, andhra pradesh

A conistable from andhra pradesh krishna district cheated his colleague lady conistable on the pretext of marriage and married another girl. on posting marriage photos in social media mainly facebook the victim got shocked after viewing the same.

కానిస్టేబుల్ బండారాన్ని బయటపెట్టిన ఫేస్ బుక్..

Posted: 11/29/2017 12:46 PM IST
Facebook reveals conistable s cheating

వారిద్దరిదీ ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. ఒకే చోట విధులు నిర్వహించే వారు. పరిచయం అయ్యేంత వరకు చూపులు కలిశాయి. ఆ తరువాత మనసులు కలిసాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. ప్రణయంలో పడితే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా మోసపోతారన్న విషయం తెలిసినా.. అమె అందుకు మినహాయింపు కాలేకపోయింది. అమె కూడా అతడు అగిడిన వెంటనే తాను దాచుకున్న డబ్బును కట్నంగా అతడికి ఇచ్చింది.

అ వెంటనే అమె మరో ప్రాంతానికి పదోన్నతిపై బదిలీ అయ్యింది. ప్రణయ పక్షుల మధ్య దూరం పెరిగింది. అంతేకాదు అంతరం కూడా పెరుగుతూ వచ్చింది. రోజు సంబాషించుకునే వారు కాస్తా.. వారంలో రెండు సార్లు, మూడు సార్లు మాత్రమే మాట్లాడుకునేవారు. అయితే అప్పుడు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా రోజులు గడిచిన కొద్ది అమెకు సందేహం అధికమైంది. దీంతో అమె అతని ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూడగానే అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందీ..?
 
విజయవాడకు చెందిన రావూరి విమల, బాడిశ గోపీకృష్ణలు 2014 నుంచి జి.కొండూరు పీఎస్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఈడు జోడు కలవడంతో పాటు మనసు మనసూ కూడా కలవడంతో వీరిద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. గోపీ కృష్ణపై నమ్మకంతో అడ్వాన్స్ గా రూ.2.70 లక్షలు కట్నంగా ఇచ్చింది. విమల గత ఏడాది విజయవాడ రైల్వే పోలీస్‌స్టేషన్ కు బదిలీ అయింది. పలుమార్లు పెళ్లి ప్రస్తావన తేవడంతో అతను దాటవేస్తూ వస్తున్నాడు.
 
ఈ నెల 24న గాజువాకకు చెందిన యువతిని గోపీకృష్ణ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో గోపీకృష్ణ బండారం బయడపడింది. బాధిత మహిళా కానిస్టేబుల్‌ ఏ స్టేషన్‌లో పనిచేసిందో ఆ స్టేషన్‌లోనే న్యాయం కోసం ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం విజయవాడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. కానిస్టేబుల్‌ గోపీకృష్ణపై 420, 417, సెక్షన్‌ 3,4 డీపీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.రాజేష్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles