deepa jayakumar sensational comments on jayalalithaa heir ‘‘అమ్మాయి నిజం.. కానీ..’’ జయలలిత మేనకోడలి నోట సంచలనం..

Deepa jayakumar sensational comments on jayalalithaa heir

tamilnadu, chief minister, jayalalithaa, amrutha sarathy, shobanbabu, deepa jayakumar, sasi kala, e palanisamy, o panneruselvam, ttv dinakaran, stalin, aiadmk, two leaves symbol, rk nagar, tamil politics

Tamilnadu late chief minister jayalalithaa niece deepa jayakumar had made sensational comments on jayalalithaa heir. She said it's true that her aunt gave birth to a girl child, but dont known about her whereabouts.

అమ్మాయి నిజం.. కానీ.. జయలలిత మేనకోడలి నోట సంచలనం..

Posted: 11/29/2017 01:37 PM IST
Deepa jayakumar sensational comments on jayalalithaa heir

అమ్మాయి నిజం.. కానీ.. అంటూ జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను కూతురినంటూ వచ్చిన అమృతా సారధి వాదనల్లో నిజమెంత..? అమె తనకు తాను జయలలిత కూతురినంటూ ప్రకటించుకుంటున్న తరుణంలో అమెకు మరో అవకాశం ఇవాల్సిన అవసరం వుందా..? అన్న అనుమానాలు ఉత్పన్నమయ్యేలా దీపా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను జయలలిత కూతురినంటూ చెప్పుకోచ్చిన అమృత సారథి.. తాను అమె కూతురినేనన్న విషయాన్ని నిరూపించుకునే క్రమంలో తనకు ఓ అవకాశం ఇవ్వాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించినా న్యాయస్థానం అమె పిటీషన్ ను తోసిపుచ్చింది. ఇప్పటికే జయలలిత జయలలిత బిడ్డలమంటూ, పలువురు కోర్టులను ఆశ్రయించి భంగ పడిన నేపథ్యంలో అమృత సారధికి కూడా అదే పరాభావం ఎదురైంది.

ఈ క్రమంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమేనని అయితే ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది? ఎవరు? ఇప్పుడెలా ఉంది? అన్న విషయాలు తనకు తెలియవని అన్నారు. దీప వ్యాఖ్యలు జయలలిత వారసత్వంపై మరింత ఉత్కంఠను పెంచాయి. మరి ఈ తరుణంలో న్యాయస్థానం అమృతకు అవకాశం ఇవ్వనుందా..? లేదా..? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chief minister  jayalalithaa  amrutha sarathy  shoban babu  deepa jayakumar  tamil nadu  

Other Articles