Sunny Leone tops Yahoo Most Searched Celebrity 2017 list మళ్లీ సన్ని లియాన్ కే అగ్రస్థానం..

Sunny leone tops the list as most searched bollywood actress on yahoo

Sunny Leone, Kapil Sharma, Yahoo Most Searched Celebrity 2017 list, yahoo most searched celebrity list, Bollywood, Priyanka Chopra, Aishwarya Rai, Katrina Kaif, Deepika Padukone, Kareena Kapoor, Mamata Kulkarni, Disha Patani, Kavya Madhavan, Esha Gupta

Bollywood actress Sunny Leone has once again proved why she is the queen of the online world. Yahoo has released a list of most popular celebrities of 2017 and it Sunny topping the charts with Priyanka Chopra on number two

మళ్లీ సన్ని లియాన్ కే అగ్రస్థానం.. కపిల్ శర్మకు కూడా..

Posted: 12/01/2017 07:24 PM IST
Sunny leone tops the list as most searched bollywood actress on yahoo

శృంగార తార హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చిన అందాల బామ సన్ని లియాన్ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. 2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది‌. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌లాంటి స్టార్‌ హీరోయిన్‌లను దాటుకొని యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ జాబితాలో మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్‌ నిలిచారు.   

ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా అగ్రస్థానంలో నిలిచారు. మొన్నటి తరం సినీమా నటుడిగా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసిన వినోద్‌ ఖన్నా  మృతి చెందిన అనంతరం ఆయన గురించ నెట్ జనులు చాలానే వెతికేశార. అసలు ఈయన ఎప్పటి నటుడు, ఆయన నటించిన చిత్రాలు, ఆయన జీవితంలో కీలక విషయాలపై ఈ అన్వేషణ సాగిందట. యాహూ సర్చ్ ఇంజన్ వేదికగా ఈ అన్వేషణ సాగిందని ఆ సంస్థ ప్రకటించింది. వినోద్ ఖన్నా తరువాతి స్థానంలో అగ్రహీరోలు, పాపులర్ నటులను దాటుకుని బుల్లితెరపై సంచలనం రేపుతున్న నటుడు కపిల్ శర్మ వచ్చి చేరాడు.

కపిల్ కామెడీ షో తో యావత్ భారత ప్రేక్షకులకు సుపరిచితుడైన కపిల్ శర్మ.. అనూహ్యంగా రెండో స్థానాన్ని అక్రమించుకున్నాడు. సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, రజినీ కాంత్‌ లాంటి ప్రముఖలను దాటుకుని శంకర్ లాంటి దర్శకులను వెనక్కి నెట్టి మరీ రెండో స్థానంలో నిలిచాడు. అందుకు ఆయన చేసిన వివాదాలు కూడా కారణం కావచ్చు. అ మధ్య తన టీమ్ తో విదేశాలకు వెళ్లి తిరిగివస్తూ అయన తన సహచరులపై దాడికి పాల్పడిన ఘటన, లేదా అ తరువాత ఆయన టీమ్ మేట్స్ ఆయనను విడిచి వెళ్లడం, మళ్లి వచ్చి కలవడం లాంటి ఘటనలతో కపిల్ శర్మ రెండోస్థానాన్ని అక్రమించివుండవచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి.

2017 యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితా
సన్నీలియోన్
ప్రియాంకా చోప్రా
ఐశ్వర్య రాయ్
కత్రినా కైఫ్
దీపికా పదుకునే
కరీనా కపూర్
మమతా కులకర్ణి
దిశాపటాని
కావ్యా మాధవన్‌
ఇషా గుప్తా

2017 యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీల జాబితా

వినోద్ ఖన్నా
కపిల్ శర్మ
దిలిప్
జస్టిన్ బీబర్
సునీల్ గ్రోవర్
కమల్ హాసన్
రజనీకాంత్
రుఫీకాపూర్
అమితాబ్ బచ్చన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Kapil Sharma  Yahoo  Most Searched  Celebrity  2017 list  entertainment  

Other Articles