ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ లలో తన సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రాకు జనం ఐదోసారి నీరాజనాలు పలికారు. లండన్ కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఈస్ట్రన్-ఐ’ ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఆన్ లైన్ పోల్-2017లో అత్యధికులు ప్రియాంకను ప్రపంచ సెక్సీయస్టు ఏసియన్ వుమెన్ గా అక్కడివాళ్లు మరోమారు ఆమెను ఎంపిక చేశారు. గత ఏఢాది కొద్దిలో తన చేతి నుంచి ఈ అవార్డును అందుకున్న దీపికా పదుకునే నుంచి ఈ సారి మరోమారు ప్రియాంకను అవార్డును వరించింది.
ఈ ఏడాది ప్రపచం అత్యంత శృంగార అసియా మహిళల జాబితాలో మన దేశానికి చెందిన వారే టాప్ ఐదు స్థానాలను అక్రమించారు. గతేడాది తొలిస్థానంలో నిలిచి సెక్సీయస్టు ఏసియన్ వుమెన్ గా నిలిచిన దీపికా పదుకునే ఈ ఏడాది మూడో స్థానానికే పరిమితమయ్యింది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా మొత్తం 50 మంది అత్యంత శృంగార మహిళలను ఈస్ట్రన్-ఐ ఎంపిక చేసింది. ‘ఈ కీర్తి నాదని చెప్పలేను. నిజానికది నా రూపానిది. మీ కళ్లది’- అంటూ తనదైన శైలిలో ఆన్ లైన్ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు పిసీ.
అంతర్జాతీయ బుల్లితెర కార్యక్రమం ‘క్వాంటికో’లో ఆమె పాల్గొంటున్నారు. ‘అందం, విద్వత్తు, ధైర్యం, ఆర్ద్ర హృదయాల అద్భుత మేళవింపే ప్రియాంక చోప్రా’ అని నిర్వహణ సంస్థ వ్యవస్థాపకుడు నజీర్ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ ఏడాది ఈ పోల్ లో పాల్గోన్న భారతీయ బుల్లితెర నటి నియా శర్మ కూడా బాలీవుడ్ నటి, గతేడాది ఈ ఖ్యాతిని అందుకున్న అందాట బ్యాూటీ దీపికా పదుకునెను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవడం విశేషం.
ఇక దీపిక ఈ సారి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నాలుగో స్థానంలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నిలువగా, ఐదవ స్థానంలో మాత్రం పాకిస్తానీ నటి మాహిర్ ఖాన్ నిలచింది. ఇక ద్రష్టిధామీ, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, గౌహర్ ఖాన్, రుబీనా దిలోక్ లు వరుసగా అరు, ఏఢు, ఎనమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. ఎంపికైనవారిలో అత్యంత పిన్న వయస్కురాలు 19 ఏళ్ల టీవీ నటి శివాంగీ జోషి (16వ స్థానం) కాగా... అత్యంత పెద్ద వయస్కురాలు 54 ఏళ్ల శ్రీదేవి (49వ స్థానం) కావడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more