చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి, ఆవేదనను తీర్చే ప్రయత్నం చేశారు. టీడీపీ మీద, టూరిజం మంత్రి మీద దాడికి ఈ వేదికను ఉపయోగించడం లేదన్నారు. నష్టపరిహారాలతో ప్రాణాలు తిరిగివస్తాయా..? ఒక్కసారి జరిగితే ప్రమాదం.. అదే పునారావృతం అవుతుంటే ఆ ప్రమాదాలకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పరిహారాల ప్రకటన లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీదే వుందని పవన్ అన్నారు.
ఇంటి సభ్యులను కొల్పయిన బాధ అందులోనూ ఇలా అకస్మాత్తుగా ప్రమాదాల భారిన పడి మన అనుకున్న వారిని కోల్పోతే బాధ మాట్లలో చెప్పలేదనిదని అన్నారు. అలాంటి క్షోభ మరే కుటుంబానికి రాకుండా చేయాలంటే ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలే ఆలోచించాలన్నారు. నిర్లక్ష్య ధోరణి, చేసిన పనే చేసి విసిగిపోతాం.. ఇంతేగా అనుకుంటాం.. కానీ ప్రమాదం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలయిదు కాబట్టి అప్రమత్త అవసరమన్నారు. సున్నితత్వం కోల్పోకూడదని.. అదే ఇన్ని ప్రాణాలను బలితీసుకుందని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.
ఓటు అనే బోటు మీద మీరు తీరం దాటిన రాజకీయ నేతలు.. అదే బోటు ప్రయాణంలో తమ ప్రాణాలను కొల్పోయిన వారిని మాత్రం పరామర్శించరు. ప్రమాదం జరిగిందని అంటున్నారు.. ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎవరి తప్పిదం వల్ల జరిగింది..? అనేది విచారణ తరువాత తేలుతుంది. అయితే విచారణ నివేదిక వచ్చిన తరువాత తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని అల్పలు, లేదా కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం మాని. అసలు ప్రమాదమే జరగని స్థాయిలో చర్యలకు ఉపక్రమించాలని పనవ్ ఉద్ఘాటించారు.
అఖిల ప్రియ.. మీరు అతి కొద్దికాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను వెంటనే అర్థం చేసుకోగలరు. శోభ నాగిరెడ్డి దంపతులు నాకు పీఆర్పీ నుంచి తెలుసు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి తోడ్పడ్డా అని పవన్ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు.
అఖిల ప్రియను తప్పుబట్టడం లేదంటూనే లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతాన్ని జనసేనాని ప్రస్తావించారు. లాల్ బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే.. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అఖిల ప్రియ అలా చేయనక్కర్లేదు. కానీ ఇక్కడికి రావాలి. మీ తప్పేం లేదు. కానీ మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యం అవుతుంది. మీ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల చెబుతున్నా. వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడండి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఏం చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందించండని సూచించారు.
కాగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. గత నెలలో విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను శనివారం పవన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను పార్టీ శ్రేణులు ఓ హాలు వద్దకు తీసుకురాగా పరామర్శకు పవన్ విచ్చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా యువకులు భారీగా తరలివచ్చారు. అయితే... వీరిని హాలు బయటే పోలీసులు నిలువరించడంతో కార్యక్రమం సాఫీగా జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more