గుజరాత్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం సుమారు 65గా నమోదయింది. అయితే గత రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్ ఓటరు కషాయ పార్టీకి ఓటువేస్తూ.. మూడు పర్యాయాలు ప్రధాని నరేంద్రమోడీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకువచ్చింది. కాగా, ఈ ఎన్నికలలో మాత్రం గుజరాత్ ఓటరు ప్రధాని పిలుపును అందుకోలేదు. అయన ఇచ్చిన పిలుపుకు భిన్నంగా స్పందించారు.
గత ఎన్నికలలో తొలిదశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో 72 శాతం ఓటింగ్ నమోదు కాగా. ఈ సారి మాత్రం ఇది కేవలం 64 నుంచి 66 మధ్య మాత్రమే కొనసాగనుంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని మొత్తం 89 స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే.
2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని మొత్తం 89 స్థానాల్లో 63 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందగా, 22 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అయితే ప్రధాని పిలుపుకు మేము మాత్రం అచరిస్తామని వచ్చారో లేక తమ హక్కును వినియోగించుకునేందుకు వచ్చారో తెలియదు కానీ.. గుజరాత్ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల్లో పెళ్లి జంటలు విచ్చేశాయి. సూరత్‌లో కతార్గాం పోలింగ్ కేంద్రంలో ముఖానికి పసుపుతో ఫెన్నీ ఫరేఖ్ అనే మహిళ ఓటు వేయడానికి వచ్చింది.
అలాగే భరూచ్ పోలింగ్ కేంద్రంలో ఇవాళ పెళ్లి చేసుకుంటున్న ఓ జంట పెళ్లి బట్టలతో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాజ్‌కోట్‌లోని ధారళా గ్రామంలో మమతా గొండాలియా అనే యువతి పెళ్లి కూతురిగా వచ్చి ఓటు వేసింది. వీరి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. కొంతమంది ప్రజాస్వామ్యం పట్ల వీరికున్న బాధ్యతను పొగిడేస్తుంటే... మరికొంత మంది మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ ప్రయత్నం అంటూ పెదవి విరుస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more