గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి అంతా గప్ చుప్. ఇక ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే తెరవెనుక కార్యకలాపాలకు తెరలేవనుంది. ఇవాళ గుజారత్ లో రెండో దశ పోలింగ్ ముగియడంతో ఇన్నాళ్లు ప్రజలకు చెవులకు విశ్రాంతి లేకుండా వినిపించిన నేతల హామీలకు ఇక బ్రేక్ పడింది. చివరి రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపిలు పోటాపోటీగా నిర్వహించతలపెట్టిన ర్యాలీలకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో ఇరు పార్టీల అగ్రనేతలు తమ ప్రచార పంథాను మార్చుకున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని సీఫ్లేన్ ప్రయాణాన్ని టార్గెట్ చేసి.. గెలుపు తమదేనని మీడియా సమావేశం నిర్వహించగా, ప్రధాని మాత్రం సీప్లేన్ లో ప్రయాణం చేసి.. ఇలాంటి అభివృద్దిని కూడా చేశామని చాటిచెప్పారు.
దేశంలోనే తొలిసారి సీప్లేన్ లో ప్రయాణించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరూ గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీల ర్యాలీలను పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. ప్రధాని వెంటనే ప్లాన్ బి అమలు చేశారని అనుకుంటున్నట్లు కాకుండా సీ ప్లేన్ లో ప్రయాణించాలని ముందుగానే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు ప్రధాని మోడీ. ఈ సముద్ర విమానం నడిపిన పైలట్ చెప్పిన విషయాలే మేము చెబుతున్నది నిజమని స్పష్టం చేస్తుంది. ‘క్వెస్ట్ కొడియాక్ 100 సీప్లేన్’ నడిపేందుకు కెనడా నుంచి వచ్చిన పైలట్ జాన్ గులెట్ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజుల క్రితమే తనకు ఈ మేరకు సమాచారం అందిందని తెలిపాడు.
తాను ప్రధానమంత్రిని తీసుకెళ్లనున్నందుకు సంతోషంగా వుందని ఆయన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. సమర్బతిలో సీప్లేన్ నడపడం చాలా సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు ప్రధానమంత్రికి పలు జాగ్రత్తలు చెప్పాననీ.. మోడీ ఓ మంచి ప్రయాణికుడనీ ప్రశంసలు కురిపించాడు. సాధారణ విమానాలను కూడా నడపగలిగిన ఆయన.. సబర్మతి నదీతీరంలో దిగడం ఏమంత కష్టం కాలేదని పేర్కొన్నారు. భారత దేశంలో అనేక సరస్సులు, నదులు, తీర ప్రాంతాలున్నందున... సీప్లేన్లు అందుబాటులోకి వస్తే ఇక్కడ బాగా ప్రాచుర్యంలోకి వస్తాయని గులెట్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీప్లేన్‌ను ఉపయోగించడంపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని సీప్లేన్ లో ప్రయాణించాలనుకోవడంలో తప్పులేదని, గుజరాత్ ప్రజలకు 22 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నకు దూరంగా ఉండేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని కేవలం 5 నుంచి 10 మంది సన్నిహితులకు ఉపయోగపడే అభివృద్ధి నమూనాను చేపట్టారని, సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని తన ర్యాలీల్లో రైతుల సమస్యలు, అవినీతిని ప్రస్తావించడం లేదని గుజరాతీలు గ్రహించారని, ప్రజల్లో పాలక సర్కార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కించిన తర్వాత జబర్దస్త్ ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తన ఆలయాల దర్శినంపై బీజేపీ చేసిన విమర్శలకు ఆయన బదులిచ్చారు. తాను ఆలయాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారి గుజరాత్ బాగుండాలని బంగారు భవిష్యత్ ఉండాలని కోరుతున్నాను. తన ఆలయాల సందర్శన అంశం.. గుజరాత్ కు కానీ, ఎన్నికలకు ముడిపెట్టే అంశం కాదని అన్నారు. గత మూడు నెలలు గుజరాత్ ప్రజలు నాపై లెక్కలేనంత ప్రేమ కురిపించారని. ఇది తాను జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
తాను ఏ ప్రాంతానికి వెళ్లిన మంచి సేవలు అందించారు. మూంగ్ ఫాలీ, ఢోక్లా, థెప్లావంటివి ఇచ్చి తనను ఆశ్చర్య పరిచారన్నారు. గుజరాత్ ప్రజలకు ఎప్పుడు అవసరం ఏర్పడినా ఒక్క ఫోన్ చేస్తే చాలునని అన్నారు. అదే సమయంలో జీఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ మోదీని మరోసారి విమర్శించిన రాహుల్.. తమ పార్టీ గుజరాత్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా నెరవేర్చుతుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలు తమ హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.
రంగంలోకి బెట్టింగ్ బంగార్రాజులు..
ఇక ఎన్నికల ప్రచారం ముగియడంలో రంగంలోకి దిగిన ఈసీ అధికారులు పొలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న గుజరాత్, హిమాచల్; అర్కేనగర్ సహా దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరుగుతున్న ఉపఎన్నికలకు కూడా కౌంటింగ్ జరగనుంది. దీంతో విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్న ఆయా పార్టీల నేతలు.. ధీమా వ్యక్తం చేస్తుండగా, గుజరాత్ ఫలితాలపై ఇప్పట్నించే ట్టింగులు కూడా జోరందుకున్నాయి. గుజరాత్ లో బీజేపి గెలిస్తే.. వందకు వెయ్యి రూపాయలు వస్తాయని కూడా ప్రచారం జోరందుకుంది. కాగా, కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాసే వారికి వందకు ఐదువందలు మాత్రమే వస్తుందని కాస్తుండటం విశేషం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more