beware of phone calls asking bank details వివరాలు చెప్పగానే డబ్బు గోవింద..

Beware of phone calls asking atm details they may draw your money

never let strangers your bank details, never let atm card details to strangers, atm card, renewal, bank account, balu vidyasagar, kanupuru, nellore, andhra pradesh

A phone call to balu vidyasagar of nellore andhra pradesh state that he is regional manager, wants to renewal atm card as it is blocked. After disclosing the details he noticed amount withdrawl from his account.

సైబర్ క్రైం: వివరాలు చెప్పగానే డబ్బు గోవింద..

Posted: 12/12/2017 07:26 PM IST
Beware of phone calls asking atm details they may draw your money

బ్యాంకులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నా.. మోసపోయేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పైన దగా, కింద దగా, కుడిఎడమల దగా దగా అన్న విధంగానే నేరాగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తగా అలోచించి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బ్యాంకులతో పాటు అర్బీఐ కూడా ఖాతాదారులను అప్రమత్తం చేసింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరితోనూ మీ బ్యాంకుకు సంబంధించిన ఖాతాల వివరాలు కానీ, మీ ఏటీయం కార్డు వివరాలు కానీ, మీ క్రెడిట్ కార్డుల వివరాలు కానీ తెలియజేయవద్దని సంక్షిప్త సందేశాలను కూడా పంపుతుంది.

అంతేకాదు బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ పిన్‌ నంబర్లు, కార్డు నెంబర్లు అడగరనీ, వాటిని ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదని కూడా చెబుతున్నారు. అయినా వాటిని చదవి పక్కన పడేసే ఖాతాదారులు.. ఏదో పనిలో వుండగా, ఒక్క ఫోన్ కాల్ వస్తుంది. తాము బ్యాంకు సిబ్బందిమంటూ.. బురడీ కోట్టించి వివరాలు తెలుసుకుంటారు. అప్పుడైనా అప్రమత్తం కాకపోతే.. మీ అకౌంట్లో వున్న డబ్బు గోవింద.

మీరిలా వివరాలు చెప్పడం పూర్తి కాగానే మీ ఫోన్ కు ఓ సందేశం వస్తుంది. మీ అకౌంట్లో నుంచి ఇంత సోమ్ము విత్ డ్రా అయ్యింది అని. అచ్చంగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు అంధ్రప్రదేశ్ లోని ఓ ఖాతాదారుడు. మండలంలోని కనుపూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన డెబిట్‌ కార్డు నంబరు చెప్పి అక్షరాలా రూ.74,993 లను పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కనుపూరు గ్రామానికి చెందిన బాలు విద్యాసాగర్‌ నెల్లూరు కోటమిట్టలోని విద్యుత్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు.
 
అయితే ఈ నెల 9 న ఇంట్లో ఉండగా 776215699 నంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను స్టేట్‌బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌నని హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నానని హిందీలో చెప్పాడు. డెబిట్‌ కార్డు తీసుకుని ఎక్కువ కాలం అయినందువల్ల బ్లాక్‌ అవుతుందని అందువల్ల కార్డు నంబరు చెబితే రెన్యువల్‌ చేస్తానని నమ్మబలికాడు. దీంతో ఉద్యోగి తన కార్డుపై ఉన్న 12 అంకెల నంబరును చెప్పాడు. నంబరు చెప్పిన కొద్ది క్షణాల్లో తన అకౌంటు నుంచి రూ. 74,993 డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడ్డ విద్యాసాగర్‌ బ్యాంకు శాఖలో సంప్రదించారు. అయితే అందుకు తామేమీ చేయలేమని చెప్పడంతో బాధితుడు సోమవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles