అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. దేవాదాయ శాఖలో పనిచేస్తూ.. దేవుడి సోమ్ముకే పంగనామాలు పెట్టి.. సొంత ఆస్తిని పెంచుకున్న ఆ శాక ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ ఇంటిపై దాడులు చేసిన అధికారులు ఆయన ఆస్తులను చూసి నివ్వెరబోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 కోట్ల అస్తులు ఆయన నుంచి బయటపడగా, ఆయన బినామి పేరున సుమారు రూ.150 కోట్ల రూపాయల అస్తులు వున్నాయని గుర్తించారు.
పేరులో మాత్రం చంద్రశేఖర్ అజాద్ పేరును పెట్టుకున్నా.. ఈ అవినీతి దేవాదాయశాఖకు చెందిన అధికారి మాత్రం భారీ జాదూ తిమింగలమని అంటున్నారు ఏసీబి అధికారులు. అజాద్ అవినీతిపై పక్క సమాచారం అందడంతో ఆయనపై నిఘా పెట్టిన అధికారులు .. ఆయన ఆస్తులపై తెలుగు రాష్ట్రాల్లోని 16 చోట్ల ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. అతని ఆస్తుల చిట్టా చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. రాజమండ్రిలో ఆయన నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంతో పాటు విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, నూజివీడు, అనంతపురం జిల్లా నల్లచెరువు తదితర ప్రాంతాల్లో ఆజాద్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు జరిగాయి.
ఏసీబీ సోదాల్లో ఆజాద్ సోదరుడు వివేకానంద పేరిట రూ.55 కోట్ల ఆస్తులు ఉన్నట్టు బయటపడగా, ఆజాద్ తన బినామీల పేరిట ఏకంగా రూ.150 కోట్ల వరకు పోగేశారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఆర్జేసీ హోదాలో ఉన్న ఆయన 2000వ సంవత్సరంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరుతూనే ఆ శాఖలోని భూములపై పట్టు సాధించారు. సోదరుడు వివేకానందను బినామీగా మార్చుకుని 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. రాష్ట్ర విభజన తర్వాత ‘రియల్’ రంగం కుదేలైనా ఆజాద్ ఆస్తులు మాత్రం గణనీయంగా పెరిగాయి.
విజయవాడలో అభేద్య సోలార్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌ను ప్రారంభించిన ఆజాద్ తన సోదరుడి వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్, దినసరి కూలీలను బినామీలుగా మార్చుకున్నారు. వారి పేర్లపై కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కాగా, ఆజాద్‌పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై విచారణ జరపాలంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు జీవోలు జారిచేసిందంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ శాఖకు చెందిన విజయరాజ్ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో ఆజాద్ కొంత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నగదు, ఆస్తిపాస్తులు తన పేరుపై లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏసీబీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.10 లక్షలకుపైగా విలువైన గృహోపకరణాలు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.7.25 లక్షల డిపాజిట్లు గుర్తించారు. విజయవాడ గుణదలలో ఓ భారీ భవంతి, గొల్లపూడిలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నూటన్స్ అపార్ట్మెంట్లో ఆయన పేరుపై త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ ఉంది. అక్కడే నివసిస్తున్న ఆయన భార్య వద్ద 1100 గ్రాముల బంగారు నగలున్నాయి. దాడులు కొనసాగుతుండడంతో మరిన్నిఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more