మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి అధికార పార్టీ తీర్థం తీసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇవాళ అమె అధికారికంగా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇప్పటికే అధికార పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మరో మంత్రి హరీశ్ రావుల సమక్షంలో తన కుమారుడు సందీప్‌రెడ్డి వెంటబెట్టుకుని కలసిన అమె.. గురువారం రోజున అధికారికంగా కారు ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా తెరపైకి వస్తునే వున్నాయి. అమె కూడా రేవంత్ రెడ్డితో కలసి పార్టీని వీడుతారన్న వార్తలు రాగా, అమె అప్పట్లో కాంగ్రెస్ లో చేరేందుకు చివరి క్షణంలో డ్రాప్ అయ్యారు. దీంతో అమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నాయకుల కొరత ఏర్పడింది. ముక్కిమూలుగుతూ నలుగురు నాయకులు వున్నా.. వారందరినీ గాడిలో పెట్టి ముందుకు దూసుకెళ్లే విధంగా ఏ నాయకుడు లేకపోవడం గమనార్హం. ఎన్టీయార్ పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఇప్పటి వరకు తెలుగదేశం పార్టీకి అండగా వుంటుంది తెలంగాణకు చెందిన నేతలే. తెలంగాణ మంచి పట్టుసాధించిన తెలుగుదేశం పార్టీ.. ఇంతలా పరిస్థితిని దిగజార్చుకోవడానికి కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. టీడీపీకి ఓటు బ్యాంకు వుందన్న విషయం గత ఎన్నికలలో స్పష్టమైనా.. దానిని కాపాడుకునే స్థాయిలో నేతలు కరువయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more