రెండు దశాబ్దాలుగా తమ పార్టీకి కంచుకోటగా వున్న గుజరాత్ లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంతలా వచ్చినా.. సమకాలిన రాజకీయాలలో చక్రం తిప్పి తమదైన గెలుపును అస్వాధించడంలో తమకు తామే సాటి అని ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నిరూపించుకున్న బీజేపి.. మరోమారు గుజరాత్ పై జెండాను ఎగరవేయనుంది. గుజరాత్ గెలుపు నేపథ్యంలోనే తాను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న రాహుల్ గాంధీకి మరోమారు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
గుజరాత్ లో మా పరిస్థితి ఏం బాగోలేదు.. అందులోనూ నా పరిస్థితి అసలు బాగోలేదు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పిన మాటలు.. ఆయన నిర్వహించిన టూవీలర్ ర్యాలీలో పట్టుమని పాతిక వాహనాలు కూడా వెనక రాకపోవడంతో.. ఇక ఈ సారి విజయం కాంగ్రెస్ దేనని అంతా భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ మలివిడత ఎన్నికలు ముగిసిన అనంతరం వెలువరించిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయి. మరోమారు గుజరాత్ లో కాషాయపార్టీ జెండా రెపరెపలాడనుందని జోస్యం చెబుతున్నాయి.
ఇవాళ తుదిదశ ఎన్నికలు ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్... గుజరాత్‌లో మళ్లీ బీజేపీదే అధికారమని తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో రెండు విడతలుగా మొత్తం 182 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఏదో ఒక్కటి కాకుండా మొత్తంగా అన్ని సర్వేలు బీజేపికే అధికారం లభిస్తుందని పట్టం కట్టాయి. ఏ ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని స్పష్టం చేయకపోవడం గమనార్హం.
టైమ్స్ నౌ-వీఎంఆర్
బీజేపీ-119 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ -70, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారు.
ఏబీపీ-సీఎస్‌డీఎస్
బీజేపీ 91-99 స్థానాల్లో, కాంగ్రెస్ 78-86 స్థానాల్లో, ఇతరులు 3-7 స్థానాల్లో గెలుపు.
రిపబ్లిక్ బాత్-జన్ కీ బాత్
బీజేపీ-108 స్థానాల్లో, కాంగ్రెస్ 74, ఇతరులు 0.
సహారా సమయ్
బీజేపీ 110-120 స్థానాలు, కాంగ్రెస్ 65- 70 స్థానాల్లో గెలుపు.
ఇండియా న్యూస్
బీజేపీ 110-120 స్థానాల్లో, కాంగ్రెస్ 65-75 స్థానాల్లో, ఇతరులు 0-4 స్థానాల్లో గెలుపు.
సీ-ఓటర్
బీజేపీకి 108 స్థానాలు, కాంగ్రెస్‌కి-74 స్థానాలు.
టుడేస్ చాణక్య
బిజేపికి 135 స్థానాలు, కాంగ్రెస్ కు-47 స్థానాలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more