తన హ్యసంతో తెలుగు ప్రేక్షకులను అనతికాలంలోనే అకట్టుకున్న టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ కేసులో విజయ్ సాయి సెల్పీ వీడియోలో తన మరణానికి బాధ్యులుగా చేసిన ముగ్గురిలో ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోకపోవడంతో ఈ అరోపణలు వినబడుతున్నాయి. కాగా ఈ కేసులో విజయ్ సాయి భార్య వనిత అరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు విజయ్ సాయి మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేపించారు.. కానీ అరెస్టు మాత్రం జరగకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తుంది.
మరోవైపు అదే రోజున వెలుగుచూసిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో అక్కడ వేగాన్ని ఇక్కడ ఈ కేసులో పోలీసులు అందిపుచ్చుకోలేకపోతున్నారా..? లేక ఈ కేసు చేధనలో వారు ఎవరి నుంచైనా ఒత్తిళ్లకు గురవుతున్నారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే విజయాన్ని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు కూడా వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకుని ఐదు రోజులవుతున్నా అరెస్టు ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తన కొడుకు సెల్పీ వీడియోను అధారంగా చేసుకుని అరెస్టు చేయాల్సిన పోలీసులు ఐదు రోజులు కావస్తున్న ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. ఆత్మహత్యకు ముందు మరో సెల్పీ వీడియోను కూడా విజయ్ రికార్డు చేశాడని, అయితే దానిని పోలీసులు ఇప్పటి వరకు బహిర్గత పర్చలేదని కూడా ఆయన అరోపిస్తున్నారు. తన కొడుకు చివరగా చెప్పిన మాటలను తాను వినాలని కోరుతున్నాడు. కాగా, విజయ్ సాయి భార్య వనిత అలియాస్ వరలక్ష్మీ అదృశ్యమైందన్న వార్తలు కూడా ఇప్పుడు షికార్లు కొడుతున్నాయి.
విజయ్ సాయి ఆత్మహత్య నేపథ్యంలో అసుపత్రికి వచ్చి ఆయన మృతదేహాన్ని చూసిన వనిత.. ఆ తరువాత నుంచి కనిపించడం లేదన్న వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అమెను విజయ్ సాయి మరణం తరువాతి రోజున అమె ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఆ తరువాత ఇదే కేసులో విజయ్ అంత్యక్రియల అనంతరం వెళ్లిన పోలీసులకు అమె అదృశ్యమైనట్లు గుర్తించారని సమాచారం.
విజయ్ సాయి సెల్పీ వీడియోను మరణవాంగ్మూలంగా చేసుకన్న పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు నోటిసులు ఇచ్చేందుకు వెళ్లగానే ఈ పరిణామం చోటుచేసుకుందని తెలుస్తుంది. అయితే అమె సెల్ పోన్ నెంబరు అధారంగా అమె ఎక్కడుందన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అమె ఎక్కడుందన్న సమాచారం తెలియగానే అమెను అదుపులోకి తీసుకునేందుకు సిద్దంగా వున్నారని తెలుస్తుంది. అయితే వనిత తన సెల్ ఫోన్, సిమ్ కార్డులను మార్చి మరోచోటకి వెళ్లిపోయిందా..? లేక వరలక్ష్మీ పేరున వున్న పాస్ పోర్టు సాయంతో దేశమే దాటిందా..? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవు తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more