ఒకప్పుడు అ పదం వింటేనే మహిళలు గుండెల్లో వణుకు పుట్టేంది. సమస్యలు ఉత్పన్నమయ్యో లేక అకారణంగానో గాని.. ఈ పదాన్ని మూడు సార్లు ఉచ్చరించి.. తమ నూరేళ్ల దాంపత్య జీవితంలోకి వచ్చిన భాగస్వాములను అకారణంగా తమ జీవితాల్లోంచి నెట్టివేశేవారు. ఇక మారిన పరిస్థితుల నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో దీనిపై దృష్టి సారించిన అధికార పార్టీ.. మహిళల్లో వున్న అందోళనను గుర్తించింది. వారికి భరోసా ఇచ్చింది. అదే మాట ప్రకారం చట్టాన్ని తీసుకువచ్చింది.
ఇంతకీ ఏంటా పదం అంటారా... తలాక్.. విడాకులు.. ఈ పదం వింటేనే ముస్లిం మహిళల గుండెల్లో గుబులు.. అలాంటి తమ భర్తల నోటి వేంట ఈ పదం మూడు పర్యాయాలు వస్తే.. ఇక తమ జీవితాలు బుగ్గే. ఇలా ట్రిపుల్ తలాక్ తమ జీవితాలను, తమ అడపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందన్న అందోళన ఇక వారిలో ప్రస్తుతం లేదు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విధంగా విడాకులు ఇవ్వటాన్ని నేరంగా కేబినెట్ స్పష్టం చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. దీంతో ఈ పద వినియోగాన్ని మూడు వరుస సార్లు చేసి విడాకులు పొందాలనుకునే వారికి ఇక కటకటాలే స్వాగతం పలకనున్నాయి.
ఈ బిల్లు ప్రకారం ఇక ఎవరైనా ముస్లిం భార్యభర్తలు ట్రిపుల్ తలాక్ చెబితే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించనుంది. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వటాన్ని రాజ్యాంగ విరుధ్ధమంటూ సంచలన తీర్పు వెల్లడించింది. కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ డ్రాఫ్ట్ ని రెడీ చేయటానికి నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటికే పాకిస్ధాన్, సౌదీ అరేబియా వంటి చాలా ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాక్ పై నిషేదం కొనసాగుతుంది. అయితే ఈ నిషేదంపై సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more