విశాఖపట్నం.. అంధ్రప్రదేశ్ లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయితే అంతకన్నా వేగంగా అక్కడ చోటుచేసుకుంటున్న వింతలు మాత్రం ప్రపంచ దృష్టినే అకర్షిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి రాగానే ప్రతి విచిత్ర విషయం వింతగా మారి ట్రెండింగ్ అవుతుంది. వైరల్ గా మారుతుంది. మొన్న ఈ మధ్య విశాఖలో వింత జీవులు ఓ నిర్మాణంలో వున్న భవనం అటకపైకి వచ్చి తలదాచుకున్నాయన్న వార్త ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అవి గ్రహాంతర పక్షులని.. మనుషలు మాదిరిగానే రెండు కాళ్లు, రెండు చేతులతో వున్నాయిని, ఇక మనుషుల మాదిరిగానే నిలుచున్నాయని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఏలియన్ పక్షులంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. తీరా అవి గుడ్లగూబలు అని తేల్చేశారు మన వన్యప్రాణి అధికారులు దీంతో ఏలియన్ పక్షలన్న వార్తలు క్రమంగా పోయి అందరికీ విషయం తెలిసిపోయింది.
ఇదిలా అయ్యిందో లేదో మరో వార్త అదే విశాఖలో హల్ చల్ చేస్తుంది. విశాఖ తీరంలో జాలర్లకు అచ్చం మనిషిని పోలిన చేప దొరికిందని అంటున్నారు. ముందు ఉదర భాగం, చేతులు అచ్చం మనిషి పోలి ఉన్న ఆ చేప వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండు చేతులు వెనక్కి కట్టేసి ఉంచిన ఆ చేప బతికే ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ ఇది నిజంగా విశాఖ తీరంలోనే దొరికిందా లేక ఎక్కడి వీడియోని తీసుకొని ఇక్కడ వైరల్ చేస్తున్నారా? లాంటి విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more