Won't interfere in Gujarat election, says SC గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ కు షాక్..!

Sc rejects congress plea to cross check vvpat trail

gujarat 2017 election, VVPAT, EVM, Gujarat Pradesh Congress gujarat 2017 election, VVPAT, EVM, Gujarat Pradesh Congress Committee, GPCC, supreme court, GPCC, supreme court

Gujarat Pradesh Congress, to direct the EC to count and cross-verify at least 25% of VVPAT paper trail with the EVM votes polled in the State Assembly elections fell flat in the Supreme Court

గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ కు షాక్..!

Posted: 12/16/2017 09:37 AM IST
Sc rejects congress plea to cross check vvpat trail

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యం బీఎస్సీ అధినేత్రి మాయావతి, పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అమ్ అద్మీ పార్టీ వ్యక్తం చేసిన అనుమానాలనే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కాసింత ముందస్తుగానే తీసుకున్న జాగ్రత్తను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ అరోపిస్తూ న్యాయస్థానాన్ని అశ్రయించింది.

ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొనింది. 25 శాతం వీవీపాట్‌ పేపర్‌ ట్రయల్‌ను ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ పేర్కోనింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే సమర్పించాలని కాంగ్రెస్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించింది.

మరోవైపు గుజరాత్ ఎన్నికల పోలింగ్ అంతా సక్రమంగానే జరిగిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్నిక సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేనందున పిటిషన్ ను తోసిపుచ్చినట్లు న్యాయస్థానం తెలిపింది. పోలింగ్ ముగిసినందున తర్వాతి ప్రక్రియ కొనాసాగించేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. స్పష్టమైన అధారాలుంటూ వాటిని కాంగ్రెస్ తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబరు 18న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్ లో మళ్లీ కాషాయ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే బీజేపికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందన్న విమర్శలు మిన్నంటిన నేపథ్యంలో.. రమారమి దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపి సహ ఎన్నికల సంఘంపై అరోపణలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat 2017 election  VVPAT  EVM  Gujarat Pradesh Congress Committee  GPCC  supreme court  

Other Articles