Dinakaran regretful on Jayalalithaa Hospital Video | అమ్మ వీడియోపై చింతిస్తున్న దినకరన్.. తెలీకుండానే జరిగిందంట!

Dinakaran on jayalalithaa treatment video

Tamil Nadu, Jayalalithaa, Apollo Hospital Video, AIADMK, TVV Dinakaran, VK Sasikala, Vetrivel, RK Nagar By Election, Dinakaran on Amma Video, Jayalalithaa Treatment Video

After the release of former Tamil Nadu chief minister J Jayalalithaa's hospital video clipping, ousted AIADMK leader T.T.V. Dinakaran on Thursday said he is not protecting disqualified MLA P. Vetrivel, who released the video and added he should seek apology from former AIADMK general secretary V.K. Sasikala.

జయలలిత వీడియో పై స్పందించిన దినకరన్

Posted: 12/22/2017 08:35 AM IST
Dinakaran on jayalalithaa treatment video

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ బెడ్ మీద ఉన్నప్పటి వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందన్న ఆరోపణలున్నాయి.

వీటిపై స్పందించిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు తెలియకుండానే ఈ వీడియో బయటకు వచ్చిందన్నారు. తన అనుచరుడైన వెట్రివేల్ దీనిని విడుదల చేశారని పేర్కొన్నారు. విడుదలైనది ప్రైవేట్ వీడియో అని, తాను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ‘అమ్మ’ తీయమంటేనే రికార్డు చేశామని దినకరన్ వివరించారు. ఈ విషయం సీఎం పళనిస్వామి సహా అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో వెట్రివేల్ ను తాను వెనకేసుకుని రావటం లేదని.. ఈ విషయమై శశికళను క్షమాపణలను కోరేందుకు కూడా సిద్ధమని వెట్రివేల్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధన్ అమ్మ మరణానికి శశికళే కారణమంటూ కరపత్రాలు పంచాడని.. అది తట్టుకోలేకే వీడియోను విడుదల చేసినట్లు వెట్రివేల్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా దినకరన్ గుర్తు చేశారు. శశికళ జైలుకు వెళ్లే ముందు ఆ వీడియో తన చేతికి వచ్చిందని దినకరన్ తెలిపారు. విచారణ కమిషన్ కోరితే ఆ వీడియోను సమర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో ఈ వీడియోను విడుదల చేయాలని మంత్రులు కోరినా జయలలిత నైటీతో ఉన్న కారణంగా విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావటంపై తాను చింతిస్తున్నానని దినకరన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే కావేరి టీవీ సర్వే దినకరన్ దే విజయమంటూ ఎగ్జిట్ పోల్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles