గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం విజయ్ రూపానీ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వరుసగా అరోసారి గుజరాత్ లో బీజేపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. రికార్డును సృష్టించింది. కొత్తగా కొలువుదీరిన విజయ్ రూపానీ ప్రభుత్వంలో మరోమారు డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఓపీ కోహ్లీ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఇక వీరితో పాటుగా 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు… ఇందులో 9 మంది కేబినెట్ మంత్రులుగా… 10 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. విజయ్ రూపానీ విషయంలో కొంత తర్జన భర్జన జరిగినా బీజేపీ శాసనసభాపక్షం ఎట్టకేలకు ఆయనే ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపి వ్యవహారాల ఇంచార్జ్ గా వున్న కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్టీ శాసనసభాపక్ష నేతలతో చర్చలు జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు విజయ్ రూపానీ కేబినెట్‌లో ఆరుగురు పటేళ్లకు చోటు దక్కింది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ లీడర్ ఎల్ కే అద్వానీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్, నితీష్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రులు కేశూభాయ్ పటేల్, ఆనంది బెన్, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాగా… ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more