దారి విషయంలో మహిళల మధ్య రేగిన వివాదం ఏకంగా నడివీధులో సిగపట్లకు దారితీసింది. రెండు వర్గాలుగా చీలిపోయిన మహిళలు జుత్తులు పట్టుకుని కొట్టుకోవడంతో.. తన భార్యను కొడుతున్నారన్న అక్కస్సులో ఓ అటోవాలా కూడా రెచ్చిపోయాడు. తన భార్యను కొడుతున్న మహిళలపై విరుచుకుపడి.. ఓ మహిళ కడుపులో పిడిగుద్దు గుద్దాడు. దానిని అడ్డకునేందుకు యత్నించిన మరో మహిళను రెండు పర్యాయాలు చాచి కొట్టాడు. అటోవాళ దాడితో వెనక్కు తగ్గిన మహిళలు పొట్టాటను అపేశారు. ఇరువర్గల వారు పోలీసులకు పిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ పోలీస్ స్టేషన పరిధిలో లక్ష్మీపురం, వడ్లపూడి కాలనీలకు చెందిన మహిళలు ఇళ్ల మధ్యలోని సందు (వీధి) విషయంలో గత కొన్ని రోజులుగా గొడవపడ్డుతున్నారు. ఇవాళ కూడా అదే మార్గం గుండా ఓ అటోవాలా తన భార్యతో వెళ్తున్నాడు. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన మహిళలు పద్మ, సత్యవతి అటోలో వెళ్తున్నసంతోషి అనే మహిళపై ఘర్షణకు దిగారు. దీంతో అక్కడకు చేరిన మరికొందరు మహిళలు కూడా గ్రూపులుగా విడిపోయి సిగపట్టు పట్టి మరీ పొట్లాడుకున్నారు.
కాగా, గర్భవతి అయిన తన భార్యను కొడుతున్నారని భావించిన అటోవాలా శివ.. తన భార్యపై చేయి చేసుకుంటేన్న మహిళలపై ఎదురుదాడికి దిగాడు. ఓ మహిళను పొట్టలో పిడిగుద్దులు గుద్దాడు. దానిని అడ్డుకున్న మరో మహిళను చాచిపెట్టి రెండు సార్లు కొట్టాడు. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియోలో కొందరు మహిళలు కలిసి ఓ మహిళను జుట్టుపట్టుకుని తీవ్రంగా దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే దాడికి పాల్పడుతున్న వారిపై మరో వ్యక్తి చేయిచేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more