Pseudo police officer held at Kacheguda నకిలీగా దర్జాలు వెలగబెట్టాడు.. ఉద్యోగం కోసం వెళ్లి..

Pseudo police officer held at kacheguda

Pseudo cop,Tata Indigo,raghavendra satyapal jaurkar,jaurkar,hyderabad task force,Andhra Pradeshm telangana, crime

Central Zone Task Force nabbed the pseudo cop on charges of cheating people, posing as Deputy Commissioner of Police, Home Department and DCP Head Quarters at Kachiguda.

నకిలీగా దర్జాలు వెలగబెట్టాడు.. ఉద్యోగం కోసం వెళ్లి..

Posted: 12/30/2017 11:27 AM IST
Pseudo police officer held at kacheguda

పోలీస్‌ డిపార్టుమెంట్‌లో డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారినంటూ దర్జాను వెలగబెట్టినన్ని నాళ్లు హ్యాపీగానే వున్నాడు. కానీ ఇక నకిలీయే జీవితం అవుతుందని భావించి.. అలాంటివి వద్దని ఇక హ్యాపీగా ఉద్యోగం చేసుకుందామని భావించి.. ఆ మేరకు ప్రయత్నాలు చేసిన దొంగ పోలీసు అధికారి పోలీసులకు చిక్కాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను మోసం చేస్తున్న సూడోపోలీస్‌ ఆట కట్టించారు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. కాచిగూడకు చెందిన రాఘవేంద్ర సత్యపాల్‌ జార్ఖర్‌ ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా డు. ఇతనికి చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలనే కోరిక బలంగా ఉండేది. చుదువు అయిపోయిన తరువాత 1990, 1992లో పోలీస్‌ ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తరువాత 2004లో కాచిగూడ పోలీసులు ఏర్పాటు పీస్‌ కమిటీలో మెంబర్‌గా చేరాడు. పోలీసులకు నమ్మకంగా ఉంటూ సమాచారం చేరవేయడంతో పాలు వారు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
 
ఇలా కొంతకాలం గడిచిన తరువాత 2013లో పోలీస్‌ ఉన్నతాధికారి అవతారమెత్తి చెలామని కావాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఎస్పీ స్థాయి యూనిఫాం, మరొకటి డీసీపీ స్థాయి యూనిఫాం కుట్టించాడు. అతని కారుపై పోలీసు ఉన్నతాధికారులు వాడే ఎర్రటి బుగ్గ సైరన్‌ బిగించాడు. కారుకు ఇరువెపులా పోలీస్‌ అని రాయించాడు. ఇంటి బయట పోలీస్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా రాయించుకొని ఇతరులకు లోనికి ప్రవేశం లేదు అని బోర్డు ఏర్పాటు చేశాడు. అలాగే 4 ఐడీ కార్డులను తయారుచేసుకున్నాడు. ఒకటి డీసీపీ స్థాయి, రెండోది ఏసీపీ స్థాయి, మూడోది సీసీఎస్‌, నాలుగోది ఇన్‌స్పెక్టర్‌ స్థాయి తయారుచేయించాడు.
 
ఘట్కేసర్‌ మండలం యానంపేటలోని శ్రీనిధి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీకి వెళ్లి తాను రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారినని, తనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా జాబిచ్చి నెలకు 40 వేల జీతం ఇవ్వాలని అడిగాడు. దీంతో కాలేజీ యాజమాన్యం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చి రాఘవేంద్రను అరెస్ట్‌ చేశారు. అతని నుంచి ఒక కారు, రెండు బైక్‌లు, లాఠీలు, పోలీస్‌ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cop  hyderabad  hyderabad news  police  raghavendra satyapal jaurkar  telangana  

Other Articles