అమెరికాలోని ఫ్రాడ్ కంపెనీలు ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా మోసం చేశాయి. వాటి విపరీత ప్రకటనలను నమ్మిన ఆయన తన చేతి చమురును కూడా వదిలించుకున్నారు. అర్డర్ చేసిన వస్తువు బదులు ఈమెయిల్ రావడం.. మరికొంత సొమ్ము ఇస్తే అంటూ సారాంశం వుండటంతో అయన ఏకంగా కేంద్ర మంత్రికి పిర్యాదు చేస్తే విచారించిన తరువాత తెలిసిన విషయమేంటంటే తాను మోసపోయానని. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా రాజ్యసభలో తెలిపారు.
బరువు తగ్గాలంటే ఇది వాడండి.. ఇంత డబ్బులు కట్టండి.. అంటూ వచ్చే ప్రకటనల ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మోసపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రాజ్యసభలో వెల్లడించారు. సమావేశంలో భాగంగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ ప్రకటనల అంశాన్ని చర్చకు లేవనెత్తారు. ఈ అంశం చర్చలో భాగంగా రాజ్యసభ చైర్మన్ కలగజేసుకుని తనకు జరిగిన సంఘటనను పంచుకున్నారు.
"ఇటీవల ఉపరాష్ట్రపతి పదవిలో చేరిన తర్వాత, బరువు తగ్గాలంటే తమ మందులు వాడాలంటూ వచ్చిన ఓ ప్రకటన చూశాను. వారిని సంప్రదిస్తే వెయ్యి రూపాయలు చెల్లించమన్నారు. అలాగే అని చెల్లించాను. తర్వాత మళ్లీ వారి నుంచి ఓ మెయిల్ వచ్చింది. మొదటి మందుతో పాటు మరో టాబ్లెట్ కూడా వాడాలని, దానికి మరో వెయ్యి చెల్లించాలని, అలా చెల్లిస్తేనే మొదటి మందుతో పాటు రెండో మందు కూడా పంపుతామని పేర్కొన్నారు.
దాంతో నాకు అనుమానం వచ్చి వినియోగదారుల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్కి ఫిర్యాదు చేశాను. ఆయన విచారించి ఆ ప్రకటన నకిలీదని, అది ఇచ్చిన కంపెనీ అమెరికాకు చెందినదని చెప్పారు' అని వెంకయ్య నాయుడు వివరించారు. ఇలాంటి ప్రకటనలపై ఏదైనా చర్య తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించగా... సభలో ఉన్న పాశ్వాన్.. అందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more