సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో ఏదైనా వార్త సంచలనంగా మారిపోతుంది. అయితే ఇందులో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి కొన్ని అయితే.. కేవలం సంచలనంగా మారడానికి చేసే ప్రచారాలు అనేకం వుంటున్నాయి. మొన్నీమధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును చూసి.. ఔరా అనుకుని ముందు వెనుక అలోచించకుండా కేంద్రమంత్రి సుప్రీయో డిసెంబర్ ఫూల్ అవ్వడంతో పాటు.. దానిని అలాగే షేర్ చేయడంతో నెట్ జనుల విమర్శలను కూడా ఎదుర్కోన్నాడు.
సరిగ్గా అలాగే నగరంలో నిర్మితమవుతున్న మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కు అప్పుడే పగుళ్లు ఏర్పాడ్డాయని, అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునని కూడా హైదరాబాద్ మెట్రోపై సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారడంతో స్వయంగా ఐటీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అలాంటిదేమీ లేదని అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. అయినా నెట్ జనులకు ఇదో సరదా. అయితే సరదా నవ్వించేట్టు వుండాలి తప్ప నవ్వులపాలు అయ్యేట్లు.. లేదా అందోళనకు గురిచేసేట్లు మాత్రం ఉండరాదు.
తాజాగా బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. నగరంలోని మైసూర్ రోడ్డులో ఓ పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. పలు టీవీ చానళ్లు కూడా బ్రేకింగ్ న్యూస్‌తో ఈ విషయాన్ని హోరెత్తించాయి. దీంతో ప్రజలు పోలీసులకు, కంట్రోల్ రూములకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వార్తలు అబద్ధమని తేల్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మెట్రో పిల్లర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.
నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు. పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more