కన్నతల్లి అనారోగ్యం బారిన వుంటే అమె చెంతకేగి ఏం కావాలని అడిగి మారీ అమె అవసానదశలో కొరికలన్నింటినీ తీర్చాల్సిన కన్నకొడుకు.. అమె మరణించిన తరువాత తలకొరవి పెట్టాల్సిన వాడు.. తన తల్లి తనకు చిన్నప్పుడు ఏం చేసిందన్న విషయాన్ని, ఎలా లాలించి, భుజ్జగింది అన్నం పెట్టిందన్న ఇంకితాన్ని మర్చి, తన కొడుకును ప్రయోజకుడ్ని చేసేందుకు అమె పడిన కష్టం.. అమె తిరిగి గుడులు, గోపురాల సంగతి అటుంచి నవమాసాలు మోసిన తల్లినే అత్యంత కర్కషంగా హత్య చేశాడు ఓ కొడుకు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ ప్రోఫెసర్.. తన విధులకన్నా ప్రోఫెషనల్ కిల్లర్ గానే బాగా పనిచేస్తాడని సిసిటీవీ ఫూటేజీలు వెల్లడైన తరువాత నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. కన్న కొడుకు చేతిలోనే ఘోరంగా మృతి చెందుతానని ఆ అమ్మ ఊహించలేకపోయింది. ఎండలో కూర్చోబెడతానన్న తన కుమారుడి మాటలు నమ్మి నడిచే ఓపిక లేకపోయినా అపార్ట్ మెంట్ పైకి బలవంతంగా వెళ్లింది. తనకు సాయంగా తన కొడుకు వస్తున్నాడని భావించిందే కానీ తన ప్రాణాలను హరించేందుకు పేగుపాశమే యమపాశమై వస్తుందని ఊహించలేకపోయింది.
వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్ కోట్ లోని గాంధీగ్రామ్ లో ఓ అపార్ట్ మెంటులో సందీప్ నెత్వానీ అనే ప్రొఫెసర్ నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి జై శ్రీబెన్ అనారోగ్యంతో బాధపడుతోంది. మూడు నెలల క్రితం ఆమె అపార్ట్ మెంట్ పై నుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే, ఓ గుర్తు తెలియని వ్యక్తి తాజాగా రాజ్ కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. దీంతో ఈ కేసులో మళ్లీ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్ నెత్వానిను అరెస్టు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తాను అపార్టు మెంటు పైకి తీసుకెళ్లి.. తానే కిందకు తోసివేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ప్రొఫెసర్ నిజాన్ని అంగీకరించాడు. అయితే మూడు నెలల నుంచి ఇక అంతా సవ్యంగా సాగిపోయిందని బావిస్తున్న తరుణంలో సిసిటీవీ ఫూటేజీలో నిక్షిఫ్తమైన నిజాలు బయటపడి.. అత్మహత్యగా పేర్కోన్న కేసులో అసలు హంతకుడిని అరెస్టు చేసేలా చేశాయి. తన తల్లికి ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆమెను ఆసుపత్రుల చుట్టూ తిప్పలేక విసిగిపోయానని, అందుకే హత్య చేశానని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more