అమ్మ ఈ పదం సకల చరాచర జీవులకు సుపరిచితం.. అమ్మ లేనిదే తాము లెమన్నది సత్యం.. తాము ఈ సృష్టిలోకి వచ్చామంటేనే అది అమ్మగోప్పతనమే. ఈ ప్రపంచంలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా.. అందరికంటే ముందుగా మురిసిపోయేది అమ్మే. అయితే అమ్మ గురించి చెప్పాలంటే.. ఎవరైనా అనర్గలంగా చెప్పగలరు. అసలు అలాంటి అవకాశమే వస్తే.. నిరాక్షరాస్యుడు (చదువురానివాడు) కూడా గంటల తరబడి చెప్పేస్తుంటాడు. అలాంటి సినీ విమర్శకుడిగా బహుబాగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తం మాత్రం తన తల్లి గురించి అడగగానే అలిగి వెళ్లాపోయాడు.
గత కొంతకాలంగా సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న సినిమా విమర్శకుడు కత్తి మహేష్.. తాజాగా సినీనటి పూనమ్ కౌర్ కు అరు ప్రశ్నలు సంధించి.. దీనిని సమాధానం చెప్పాలని సంచలన అరోపణలు చేశారు. ఓ నటి గురించి ఇలాంటి విమర్శలు చేయడం.. దానికి బదులు చెప్పాలంటూ ఏకంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశానికి వారికి అహ్వానం పంపడం.. అక్కడకు పవన్ కల్యాణ్ ఫ్యాన్ రావడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం అంతా జరిగిపోయింది.
ఇక సాయంత్రం వేళ.. ఓ మీడియా సంస్థలో చర్చా కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు కత్తి మహేష్.. ఈ సందర్భంగా తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనని, అలాగే.. వ్యక్తిగత అరోపణలు కూడా చేయనని అంటూనే నటి పూనమ్ కౌర్ పై కూడా తాను అరోపణలు చేయలేదని అయితే.. అమెకు తాను కేవలం ప్రశ్నలు మాత్రమే సంధించానని, వాటికి అమె బదులిస్తే చాలునని అన్నారు. ఇక ఈ విషయంలో అమెకు లాభమే తప్ప నష్టం లేదని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా ముందుగా వ్యక్తిగత దాడి ఎక్కడ నుంచి ప్రారంభమైందన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన మహేశ్ తనపై పవన్ కల్యాణ్ ఓ స్నేహితుడ్ని, ఓ అమ్మాయిని ఉసిగోల్పి వ్యక్తిగత దూషణలు, కామెంట్లు చేయిస్తుంటే సహించలేక పూనమ్ కౌర్ కు ఆరు ప్రశ్నలు సంధించానని చెప్పాడు. తాను అడిగిన ప్రశ్నలు అబద్దాలైతే తనపై పోలీసులకు పిర్యాదు చేయవచ్చునని అన్నారు. అయితే ఇలాంటి ప్రశ్నల వల్ల పూనమ్ కౌర్ ప్రతిష్టకు భంగం కలిగే ప్రయత్నం చేయడం సమంజసమేనా అని యాంకర్ అడగగానే.. ధీని వల్ల అమెకు లాభమే కలుగుతుందని అదెలా అన్నది తరువాత చెబుతానని కూడా అన్నారు.
కత్తి మహేష్ వర్సెస్ డైరెక్టర్ వివేక్..
దీంతో ఈ చర్చాగోష్టిలో పాల్గోన్న మరో వ్యక్తి తనను తాను అదే వేదికపైన కత్తి మహేష్ తో పరిచమం చేసుకున్నారు. తన పేరు వివేక్ అని, తాను డైరెక్టర్, రచయితని చెప్పుకుని అయితే మీలా విమర్శకుడిని మాత్రం కాదని అంటూనే తాను కూడా సినీరంగానికి చెందినవాడినేనని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ తో చర్చిస్తూ.. మీపై ఎవరైనా దాడికి పాల్పడితే.. మీరెలా స్పందిస్తారు.? అని ప్రశ్నించగా, తాను పోలీసుల వద్దకు వెళ్తానని మహేష్ బదులిచ్చారు. మరి ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పుకోవచ్చు కదా.. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవచ్చుకదా..? అని డైరెక్టర్ వివేక్ ఎదురు ప్రశ్నించారు. అది నేరమని చెప్పగా.. మరిప్పుడు మీరు చేస్తున్నదేమిటీ అని మళ్లి ప్రశ్నించారు వివేక్.
తనదాక వస్తే.. మౌనమె నీ బాష ఓ మూగ మనసా..
ఆ తరువాత ఈ విషయాన్ని పక్కనబెట్టిన వివేక్.. మీకు రెండు నిమిషాలు టైమిస్తున్నాం.. మీ అమ్మగారి గురించి చెప్పండీ అనగానే నా కుటుంబసభ్యులను నేను అనవసర అంశాల్లోకి తీసుకురానని మహేష్ బదులిచ్చారు. మీకు ఈ దేశపౌరుడిగా ఎమైనా అడిగే హక్కు వున్నప్పుడు.. నాకు ఈ దేశ పౌరుడిగీ మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలని వుందని అందుకనే తాను ఈ ప్రశ్న అడుగుతున్నానన్నారు వివేక్. దీంతో మీకు అడిగే హక్కువుంది, నాకు తిరస్కరించే హక్కు వుందని మహేష్ బదులిచ్చాడు.
కత్తి మహేష్ అలా మౌనంగా కూర్చిండిపోయాడు. ఏం చెప్పాలో.. ఎం చెప్పకూడదో అన్న ప్రశ్నలు అయన మదిలో తిరిగాయో ఏమో తెలియదు కానీ.. మహేష్ ఓ నిమిషం తరువాత తాను చర్చాగోష్టిని వదిలివెళ్లిపోయాడు. ఈ సందర్భంగా వివేక్ అలా వెళ్లిపోతే.. ప్రజలు పలు రకాలుగా అపార్థం చేసుకునే అవకాశముంది.. అగండీ చర్చించండీ అంటూ చెబుతున్నా.. మరోవైపు యాంకర్ కూడా అడుగుతున్నా.. కత్లి మహేష్ లైవ్ షోను క్విట్ చేసి వెళ్లాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more