ఆయన ఓ పార్లమెంటు సభ్యుడు. అందులోనూ ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ. ఇంకేముంది.. అధికారమే తమదైనప్పుడు తమను ప్రశ్నించే ధైర్యం ఎవరికి వుందన్న రేంజ్ లో ఫీలవుతుంటారు కొందరు నేతలు. అయితే అనుకోకుండా తన జీపు సాంకేతిక లోపం తలెత్తగా, బైక్ పై వెళ్లాల్సి రావడంతో హెల్మెట్ లేకుండా ప్రయాణించిన ఈ ఎంపీ మాత్రం ఎటువంటి భేషజాలకు పోకుండా ఫైన్ కట్టారు. అంతేకాదు ఇలాంటి తప్పు మళ్లీ పునరావృతం కాదని కూడా క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పోస్టు చేయగానే నెట్ జనులు ఆయనను శభాష్ అని ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన ‘ఏక్తామ్ యాత్ర’లో భోపాల్ ఎంపీ అలోక్ సంజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోపాల్ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్‌తో కలిసి బైక్ నడిపారు. అయితే, ఎంపీ అలోక్ హెల్మెట్ లేకుండా బండి నడపుతుండడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫొటో తీసి దానిని ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబరుకు పంపించాడు.
దీనికి స్పందించిన పోలీసులు హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు గాను రూ.250 చెల్లించాలంటూ నోటీసులు పంపారు. పోలీసు అధికారి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పగానే నేరుగా ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ తనకు విధించిన జరిమానాను కట్టేసి, ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదన్న దానికి వివరణ ఇస్తూ యాత్ర సమయంలో తాను, కార్యకర్తలు ప్రయాణిస్తున్న జీపు మొరాయించడంతో బైక్‌పై వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని అంగీకరించారు. ఇంకెప్పుడూ హెల్మెట్ లేకుండా బండి, సీటు బెల్టు కట్టుకోకుండా కారు నడపకూడదని ఒట్టేసుకున్నట్టు అలోక్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more