Inda restricts australia to 216 all out అసీస్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా

Icc u 19 world cup final inda restricts australia to 216 all out

india vs australia, ind vs aus, ind vs aus U-19 cwc, U-19 CWC, ICC U-19 CWC 2019, Ishan Porel, Anukul Roy, Shiva Singh, Kamlesh Nagarkoti, Jonathan Merlo, Team india, Australia, Under-19 World Cup, New Zealand, Cricket

Indian bowlers, who struck at regular intervals, bundled out Australia for 216 in the 2018 ICC Under-19 World Cup final at the Bay Oval in Mount Maunganui, Tauranga in newzealand.

అసీస్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా

Posted: 02/03/2018 10:48 AM IST
Icc u 19 world cup final inda restricts australia to 216 all out

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ లో యావత్ భారతీయుల అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా భారత్ జట్టు రానిస్తుంది. న్యూజీలాండ్ లోని టరంగా ప్రావిన్సులోని మౌంట్ మంగనుయ్ పట్టణం వేదికగా బే ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ ఉత్కంఠభరితంగా ఫైనల్ పోరులో టీమిండియా అటగాళ్లు అసీస్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.

ఆస్ట్రేలియా, భారత్ జట్లు ట్రోఫీ అందుకొనేందుకు హోరాహోరీగా పోటీ పడుతున్న క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసీస్ జట్టులో జోనథన్ మెర్లో అద్భుత ప్రదర్శనతో అర్థశతకాన్ని నమోదు చేసుకోగా, మిగిలిన క్రికెటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. మిడిలాడర్ ఆటగాడు జొనథన్ మెర్లో(76) పరుగులతో అకట్టుకున్నాడు. దీంతో భారత బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ నిర్ణీత ఓవర్లకు మరో రెండున్నర ఓవర్లు మిగిలివుండగానే కుప్పకూలింది.
 
మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే పెరోల్ దెబ్బకి ఇద్దరు ఓపెనర్లు, ఆ వెంటనే నాగర్‌కోటీ బౌలింగ్‌లో కెప్టెన్ సంగా పెవిలియన్ చేరారు. ఈ దశలో పరం ఉప్పల్‌తో కలిసి మెర్లో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 75 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ భారీ భాగస్వామ్యాన్ని ఉప్పల్ వికెట్‌తో అనుకుల్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ క్రీజ్‌లో పెద్దగా నిలబడలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో అనుకుల్, నాగర్‌కోటీ, శివ, పెరొల్ చెరి రెండు, శివం మావి ఒక వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U-19 CWC 2019  Team india  Australia  Under-19 World Cup  New Zealand  Cricket  

Other Articles