reason behind nalgonda ci missing.? నల్గొండ సీఐది అజ్ఞాతమా.? అదృశ్యమా..?

Nalgaonda ci venkateshwarlu goes missing since yesterday

komati reddy venkat reddy, bodupally srinivas reddy, nalgonda town police station, CI Venkateshwarlu, missing, excile, nalgonda murders, crime, politics

In the wake of dual murders in nalgonda town and political pressure from various parties in this regard.. responsible for missing of town CI Venkatesharlu.? police have to resolve the issue.

నల్గొండ సీఐ వెంకటేశ్వర్లుది అజ్ఞాతమా.? అదృశ్యమా..?

Posted: 02/03/2018 11:26 AM IST
Nalgaonda ci venkateshwarlu goes missing since yesterday

నల్లగొండ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కన్పించకుండా పోవడం కలకలం రేపుతుంది. తన సర్వీసు రివాల్వర్ ను డ్రైవర్‌కు, సిమ్‌కార్డును మాడ్గులపల్లి పోలీసు స్టేషన్లోను అందజేసి ఎక్కడికి వెళ్లారన్న అంశం అంతుచిక్కడం లేదు. తన పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసుల నేపథ్యంలో ఆయన తీవ్ర వత్తిడికి గురైనట్లు సమాచారం. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా.? లేక అదృశ్యమయ్యారా.? అన్న విషయం పోలీసు శాఖతో పాటు స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది.

నూతనంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నతాధికారుల ఒత్తడిని భరించలేక ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నమోదైన నేపథ్యంలో సిఐ కూడా అలాంటి విపరీత చర్యలకు పాల్పడేందుకే అదృశ్యమయ్యారా..? లేక హత్యకేసుల నేపథ్యంలో అటు ఉన్నతాధికారుల, ఇటు రాజకీయ నేతల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తడిని భరించలేక అజ్ఞాతంలోకి వెళ్లారా.? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తన వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్చాఫ్ చేయడంతో ఆయన ఎక్కడున్నారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.

శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఓ హత్య కేసులో నిందితులను మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరచడానికి సీఐ వచ్చారు. అక్కడనుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంటకు చెందిన సీఐ వెంకటేశ్వర్లు…నల్లగొండ నుంచి గరిడేపల్లి వెళ్లే మార్గంలో మాడ్గులపల్లి స్టేషన్‌లో సిమ్‌కార్డును అందజేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు వెంకటేశ్వర్లు ఇటు కుటుంబ సభ్యులకు, అటు డిపార్ట్‌మెంట్‌ వ్యక్తులకు అందుబాటులోకి రాలేదు.

స్థానిక మునిసిపాలిటీ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సంచలన హత్య కేసు, ఆ తర్వాత నాలుగు రోజులకే ఓ వ్యక్తి తల, మొండెం వేరు చేసిన హత్య కేసు వెంకటేశ్వర్లు పరిధిలో జరగడంతో ఆయన ఒత్తిడికి లోనయ్యారని చెబుతున్నారు అధికారులు. అంతేకాక శ్రీనివాస్‌ హత్య కేసులో ఏ-6 నుంచి ఏ-11 వరకు ఉన్న నిందితులకు బెయిల్‌ మంజూరైంది. హత్య ఘటన జరిగిన వారంలోనే నిందితులకు బెయిల్‌ రావడంతో వెంకటేశ్వర్లుపై మానసిక ఒత్తిడి బాగా పెరిగింది.

ఈ కేసులో ఏ-1 నుంచి ఏ-5 వరకు సెక్షన్‌ 302 హత్య కేసు, ఏ-6 నుంచి ఏ-11 వరకు సెక్షన్‌ 202 వర్తిస్తుందని సీఐ తన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అందరికీ సెక్షన్‌ 302 వర్తించేలా రిమాండ్‌ రిపోర్టు కోర్టుకు సమర్పిస్తారు. ఇక్కడ అందుకు భిన్నంగా జరగడం, ఓ వైపు కాంగ్రెస్‌ పెద్దలంతా పోలీసులు, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటంతో వెంకటేశ్వర్లుపై మానసిక ఒత్తిడి పెరిగిందంటున్నారు పోలీసువర్గాలు. ఇదిలాఉంటే, నిందితులకు బెయిల్‌ రావడంతో ఉన్నతాధికారులు వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

వెంకటేశ్వర్లు తనతో పాటు దుస్తులు కూడా తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన ఎక్కడో సురక్షితంగా ఉన్నాడని వారు భావిస్తున్నాం. అయితే ఇప్పటికీ అటు కుటుంబసభ్యులకు, సిబ్బందికి వెంకటేశ్వర్లు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విధుల ఒత్తిడితోనే సీఐ అదృశ్యమయ్యారని ఆయన పేర్కొన్నారు. సీఐ తన సర్వీస్‌ రివాల్వర్‌ను డ్రైవర్‌కు, సిమ్‌కార్డును మాడ్గులపల్లి పీఎస్ లో అప్పగించారన్నారు. సీఐ ఆచూకీ కోసం పలు బృందాలు గాలిస్తున్నాయని వివరించారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles